Vangaveeti Radha krishna – Nadendla Manohar : ఏపీలో వంగవీటి రాధ, నాదెండ్ల మనోహర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీళ్లిద్దరూ అరగంటకు పైగా భేటీ అయ్యారు. జనసేనలోకి వంగవీటి రాధ వస్తున్నాడని.. రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగింది. అయితే తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదనీ.. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని చెప్పారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. అటు వంగవీటి రాధ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాలపై ఎటువంటి చర్చలు జరగలేదన్నారు. వంగవీటి ఆఫీసుకు సమీపంలోనే జనసేన త్వరలో సమావేశం నిర్వహించబోతోంది. ఈ ఏర్పాట్లు చూసేందుకు వచ్చిన నాదెండ్ల తమ ఇంటికి వచ్చారని రాధా అంటున్నారు.
కానీ వంగవీటి అభిమానులతో పాటు జనసైనికుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా వంగవీటి రాధా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనను జనసేనలో చేర్చుకోవాలన్న అభిప్రాయంతో నాదెండ్ల మనోహర్ స్వయంగా వెళ్లి రాధాను కలిసినట్లు సమాచారం. ఆయన వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని జనసేన భావిస్తోంది.
విజయవాడలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో శ్రీ వంగవీటి రాధా గారు భేటీ అయ్యారు pic.twitter.com/pbtXgUtXFW
— JanaSena Party (@JanaSenaParty) July 1, 2022
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కలయిక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది. రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి వెళ్తున్నారనే వార్తలు హల్ చల్ చేయడంతో ఇద్దరు నేతలు కూడా అదేం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..