AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఛీ ఛీ.. వీడు అసలు మనిషేనా.. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను గదిలోకి తీసుకెళ్లి..

భార్య మీద అనుమానంతో ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.. ఆ తర్వాత.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాసి మాయమయ్యాడు.. దీంతో పోలీసులు అతని జాడ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.. కానీ దొరకాలేదు.. కట్ చేస్తే కొన్నాళ్లకు తాను తన పేరు మీద సిమ్ తీసుకోవడంతో..

Andhra: ఛీ ఛీ.. వీడు అసలు మనిషేనా.. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను గదిలోకి తీసుకెళ్లి..
Mylavaram Case
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2025 | 5:50 PM

Share

భార్య మీద అనుమానంతో ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.. ఆ తర్వాత.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాసి మాయమయ్యాడు.. దీంతో పోలీసులు అతని జాడ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.. కానీ దొరకలేదు.. కట్ చేస్తే కొన్నాళ్లకు నిందితుడు.. తన పేరు  మీద సిమ్ తీసుకున్నాడు.. దీంతో పోలీసులు దాని ఆధారంగా వెంటనే లొకేషన్ ను ట్రేస్ చేసి పట్టుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అందరిని నమ్మించిన రవిశంకర్ కేసులో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రవిశంకర్ బ్రతికే ఉన్నాడనే అనుమానంతో దర్యాప్తు చేసి పోలీసులు విశాఖలో అరెస్టు చేశారు. రవిశంకర్ బ్రతికే ఉన్నాడనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేసి విశాఖలో అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే..

ఈ నెల 12వ తేదీన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తాళం వేసిన గదిలో ఇద్దరు చిన్నారులు లక్ష్మీ హిరణ్య, లీల సాయి మృతదేహాలు లభించాయి.. అయితే.. చిన్నారులకు పురుగుల మందు తాగించి హత్య చేసిన తండ్రి రవిశంకర్.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అక్కడి నుంచి పరారయ్యాడు.. దీంతో పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా రవిశంకర్ మృతదేహం లభించకపోవడంతో, అతను బ్రతికే ఉన్నాడనే అనుమానంతో బ్యాంకు లావాదేవీలతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. అతని పేరు మీదనే కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడని తెలుసుకొని పోలీసులు లొకేషన్‌ను ట్రేస్ చేశారు.. అతను విశాఖలో ఉన్నాడని గుర్తించి అక్కడికి వెళ్లిన పోలీసులు.. రవిశంకర్ ను అదుపులోకి తీసుకున్నారు.

భార్యపై అనుమానంతోనే పిల్లలను చంపి పారిపోయినట్టు రవిశంకర్ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. భార్యపై అనుమానంతో జూన్ 8 వ తేదీన ఇద్దరు చిన్నారులకు విషం తాగించి హత్య చేసి రవి శంకర్ పరారైనట్లు తెలిపారు. ఆ రోజు భార్యతో మాట్లాడాక, ఇంటికి తాళం వేసి, అందుబాటులో లేకుండా పోయాడు. అయితే.. రవిశంకర్ తండ్రి లక్ష్మిపతి ఈనెల 12న ఇంటికి వచ్చిన క్రమంలో .. తాళం వేసి ఉన్న గది నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో తలుపులు తీసి చూడగా.. చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు. ఆ తర్వాత రవిశంకర్ రాసిన లేఖ.. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతను చనిపోయి ఉంటాడని అనుకున్నారు.. కానీ. అలా జరగలేదు.. చివరకు సిమ్ తీసుకోని పోలీసులకు దొరికిపోయాడు.. సాంకేతిక అంశాలపై దృష్టి సారించిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..