AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఆ ముగ్గురి కోసం సిట్ వేట.. ఎవరంటే..

ఇప్పటికే లిక్కర్ కేసు ఎఫ్ఐఆర్‌లో ఏ4 గా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరుండగా.. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ నెల 17న సిట్ అరెస్టు చేసింది. ఏ38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండగా ఏ 39 గా చెవిరెడ్డి తనయుడు చంద్రగిరి వైసీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పై కూడా సిట్ కేసు నమోదు చేసింది.

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఆ ముగ్గురి కోసం సిట్ వేట.. ఎవరంటే..
Ap Liquor Scam Updates
Raju M P R
| Edited By: |

Updated on: Jun 21, 2025 | 7:53 PM

Share

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అన్ని లింకులపై ఫోకస్ పెట్టిన సిట్.. అనుమానితులందరిపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. డౌట్ వస్తే చాలు ఫోకస్ చేస్తోంది. అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుతో సిట్ దూకుడు పెంచింది. ఇందులో  ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతల ప్రమేయం కాకరేపుతోంది.. లిక్కర్ కేసులో చిత్తూరు జిల్లాకున్న అన్ని మూలాలను వెతుకుతోంది సిట్.. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితులు ముగ్గురి కోసం గాలిస్తుండటం.. చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లిక్కర్ కేసు ఎఫ్ఐఆర్‌లో ఏ4 గా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరుండగా.. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ నెల 17న సిట్ అరెస్టు చేసింది. ఏ38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండగా ఏ 39 గా చెవిరెడ్డి తనయుడు చంద్రగిరి వైసీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పై కూడా సిట్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు లిక్కర్ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరినీ వెంటాడుతోంది.

తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న వారిపై సిట్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఏ 35 గా బాలాజీ, ఏ 36 గా నవీన్, ఏ 37 గా హరీష్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఇప్పటికే పరారీలో ఉన్న బాలాజీ, నవీన్, హరీష్ ల కోసం సిట్ టీమ్స్ గాలిస్తున్నాయి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నమ్మిన బంటులుగా బాలాజీ, నవీన్, హరీష్ ఉన్నారని గుర్తించిన సిట్ ఈ ముగ్గురిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్లో ఉంటున్న బాలాజీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ కాగా చెవిరెడ్డి ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైన వ్యక్తిగా కొన్నేళ్ల పాటు ఆయనతో ఉన్నాడు. ఇక తిరుపతి మండలం పుదిపట్ల చెందిన నవీన్ చెవిరెడ్డికి ప్రైవేట్ పీఏగా ఉన్నాడు. చెవిరెడ్డికి సమయానికి భోజనం సమకూర్చడంతో పాటు వ్యక్తిగత పనుల్లో కీలకంగా ఉండేవాడు. ఇక హరీష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పర్సనల్ డ్రైవర్ గా పనిచేశాడు. ప్రస్తుతం చెవిరెడ్డి వద్ద హరీష్ డ్రైవర్ గా పనిచేయడం లేదు. అయితే మద్యం ముడుపులు చెవిరెడ్డికి చేరాయని, రవాణా చేశారని అభియోగాలతో విచారిస్తున్న సిట్ ఈ ముగ్గురి పాత్ర కీలకమని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ముగ్గురు పని పట్టే పనిలో సిట్ ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?