Srisailam: శ్రీశైల మల్లన్నకు స్వర్ణ రథం.. చూసేందుకు రెండు కళ్ళు చాలవు..!
శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం బహుకరించనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. ఫిబ్రవరి 16న సంప్రోక్షణ చేసిన అనంతరం రథశాల నుంచి నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. మెరుమిట్లు గొలిపే ఈ రథంపై శ్రీభ్రమరాంబికాసమేత మల్లిఖార్జునుడు ఊరేగనున్నారు.
శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం బహుకరించనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. ఫిబ్రవరి 16న సంప్రోక్షణ చేసిన అనంతరం రథశాల నుంచి నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. మెరుమిట్లు గొలిపే ఈ రథంపై శ్రీభ్రమరాంబికాసమేత మల్లిఖార్జునుడు ఊరేగనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు కూడా పాల్గొననున్నారు.
నంద్యాల జిల్లా లోక కల్యా ణార్థం శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు మహారుద్ర శతచండీ వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగమశాస్త్రాను సారం జరిగే ఈ కార్యక్రమంలో విధిగా కలశాలను నెలకొల్పి, ఆయా కలశాలలో దేవతా శక్తిని నిక్షిప్తం చేసి జప పారాయణ, ధ్యాన, హోమాలు జరిపించనున్నారు. ఆ మంత్రపూరిత జలాలతో గర్భాలయ విమాన గాలి గోపురాలను, దేవతామూర్తులను అభిషేకించనున్నారు. ఈ మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబసమేత మల్లిఖార్జునస్వామికి విశేష పూజలు నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..