మళ్లీ విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుస్తా.. అతన్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది: కేశినేని నాని

|

Sep 03, 2023 | 9:55 AM

Vijayawada: బెజవాడ రాజకీయాల్లో కేశినేని నాని పేరు ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటుంది. ఆయన చేసే వ్యాఖ్యలు కొన్ని సార్లు సొంత పార్టీలోనే కలవరం సృష్టిస్తాయి. మరి కొన్ని సార్లు అయితే అధికార పార్టీలో మంట పుట్టిస్తాయి. కానీ ఈ సారి కేశినేని చేసిన కామెంట్స్‌ ఆసక్తిగా మారాయి.

మళ్లీ విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుస్తా.. అతన్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది: కేశినేని నాని
Kesineni Nani
Follow us on

విజయవాడ, సెప్టెంబర్ 3: విజయవాడ రాజకీయాలు ఎప్పుడూ టీడీపీ ఎంపీ కేశినేని నాని చుట్టూ తిరుగుతాయి. ఏపీ రాజకీయాలకు కేంద్రంగా భావించే విజయవాడలో ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు నాని. అయితే కొద్ది కాలంగా ఆయన వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడో సారి పోటీ చేసి లోక్ సభలో అడుగు పెడతానని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. విజయవాడలో టీడీపీ నేత బేగ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేశినేని నాని ఈ కామెంట్స్ చేశారు. ఈ సారి ఆయనకి టీడీపీ టికెట్ దక్కుతుందో లేదో అన్న ప్రచారాల నేపథ్యంలో నాని ఈ కామెంట్స్ చెయ్యడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఆయన బలంగా నమ్మిన అభ్యర్థి బేగ్‌ను కూడా గెలిపించి తీరతానని హామీ ఇచ్చారు.

మరోవైపు కొంతకాలంగా కేశినేని బ్రదర్స్ మధ్య సీటు వార్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా విజయవాడ నుంచి ఎంపీగా  కేశినాని బ్రదర్ చిన్నిని రంగంలోకి దిగబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా వినిపించింది. దీంతో కేశినేని నాని టీడీపీకి కొంతకాలం దూరంగా ఉన్నారు. ఇటీవల లోకేష్‌ పాదయాత్రలో కూడా కేశినేని నాని కలిపించలేదు. ఎంపీగా ఉన్న కేశినేని నానికి కాకుండా పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను కేశినేని చిన్నికి అప్పగించింది టీడీపీ ఆధిష్టానం. దీంతో నానియే పార్టీకి దూరంగా ఉన్నారా.. పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా అన్న అనుమానాలు పుట్టుకొచ్చాడు.

అయితే ఈ మధ్య మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు కేశినేని నాని. ఇటీవల ఎన్టీఆర్ రూ. 100 నాణెం విడుదల సందర్బంలో కూడా చంద్రబాబు పక్కనే నాని ఉన్నారు. తాజాగా విజయవాడ నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు. దీంతో కేశినేనికే విజయవాడ సీటు దక్కబోతోందా..? పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారా అనే ప్రశ్నలు రేకెత్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..