Rain Alert: సెప్టెంబరులో వానలే వానలు.. మొదటివారాంతంలో వర్షలు.. వాతావరణశాఖ ఏమంటుంది అంటే..

Rain Alert: సెప్టెంబరులో వానలే వానలు.. మొదటివారాంతంలో వర్షలు.. వాతావరణశాఖ ఏమంటుంది అంటే..

Anil kumar poka

|

Updated on: Sep 03, 2023 | 9:34 AM

ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా గత నెలలో మొహం చాటేసిన వానలు ఈ నెలలో మళ్లీ పలకరిస్తాయని వాతావరణ శాఖ తాజాగా భరోసా ఇచ్చింది. దక్షిణాది, మధ్య భారత్‌లో సెప్టెంబరు మొదటి వారంలో వానలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వానలు ఆగస్టులో కురిసిన విషయం తెలిసిందే.

ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా గత నెలలో మొహం చాటేసిన వానలు ఈ నెలలో మళ్లీ పలకరిస్తాయని వాతావరణ శాఖ తాజాగా భరోసా ఇచ్చింది. దక్షిణాది, మధ్య భారత్‌లో సెప్టెంబరు మొదటి వారంలో వానలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వానలు ఆగస్టులో కురిసిన విషయం తెలిసిందే. సెప్టెంబరులో మాత్రం నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుని వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. జులైలో అధిక వర్షాల తరువాత ఆగస్టులో చాలా వరకూ రుతుపవనాలు మొహం చాటేశాయి. నెలలో 20 రోజుల పాటు ఎక్కడా చినుకుపడలేదు. ఎల్‌నినో పరిస్థితులే దీనికి కారణం. అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కారణంగా ఇప్పుడు ఎల్‌నినో సానుకూలంగా మారడం ప్రారంభమైంది. దీంతోపాటూ తూర్పు దిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతుపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతున్నాయి. మరోవైపు దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల దీర్ఘకాలిక సగటు వర్షపాతం 167.9 మిల్లీ మీటర్లు కాగా, 9 శాతం అటూఇటూగా సెప్టెంబరులో వానలు కురుస్తాయని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..