Avinash Reddy: నన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశించండి.. హైకోర్టులో అవినాష్‌ రెడ్డి రిట్ పిటిషన్‌.

|

Mar 09, 2023 | 4:26 PM

వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్‌ వేశారు. సీబీఐ తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలని అవినాష్‌ రెడ్డి పిటిషన్‌లో కోరారు. 160 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో..

Avinash Reddy: నన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశించండి.. హైకోర్టులో అవినాష్‌ రెడ్డి రిట్ పిటిషన్‌.
Ycp Mp Avinash Reddy
Follow us on

వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్‌ వేశారు. సీబీఐ తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలని అవినాష్‌ రెడ్డి పిటిషన్‌లో కోరారు. 160 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తనను అరెస్ట్‌ చేయొద్దంటూ అవినాషర్‌ రెడ్డి కోరారు. విచారణ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని పిటిషన్‌లో అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్‌ రెడ్డి పిటిషన్‌లో కోరారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే ఉంటే వివేక హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదన్న అవినాష్‌.. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ వ్యతిరేకించలన్నారు. దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతోందని అవినాష్‌ అన్నారు.

తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాధారాలు లేకపోయినప్పటికీ.. కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్‌ ఆరోపించారు. వివేక హత్య కేసులో దర్యాప్తు అధికారి తీరు పారదర్శకంగా లేదని అవినాష్‌ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..