పెద్దపులి దాడి.. ఒక ఆవు మృతి.. వణికిపోతున్న గ్రామస్తులు..
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచెర్ల పరిసరాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా గ్రామం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. నిన్న రెండు ఆవులపై పెద్దపులి దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒక ఆవు మృతి చెందగా మరో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు పులి కాలి ముద్రలను సేకరించారు. పెద్దపులి దాడి చేసిన మాట వాస్తమేనన్నారు.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచెర్ల పరిసరాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా గ్రామం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. నిన్న రెండు ఆవులపై పెద్దపులి దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒక ఆవు మృతి చెందగా మరో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు పులి కాలి ముద్రలను సేకరించారు. పెద్దపులి దాడి చేసిన మాట వాస్తమేనన్నారు. ఆవుపై పులి దాడికి సంభందించిన ట్రాప్ కెమెరాలో రికార్డయిన ఫోటోలు అధికారులు విడుదల చేశారు. స్థానికులు, రైతులు పొలాలకు వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
ఐదు నెలల క్రితం అర్ధవీడు మండలంలో..
ప్రకాశంజిల్లా అర్ధవీడు మండలంలో ఐదు నెలల క్రితం ఇదే విధంగా పెద్దపులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అర్ధవీడు మండలంలోని లక్ష్మీపురం, బోల్లి పల్లె గ్రామాల పరిసర ప్రాంతాలలో పెద్దపులి తిరుగుతూ ఉండడంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలోని మేతకు వెళ్లిన ఓ గేదెపై పెద్దపులి దాడి చేసి చంపితినేసింది. అంతేకాకుండా బొల్లిపల్లె గ్రామ సమీపంలో కూడా ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పెద్దపులి సంచారంపై నిఘా పెట్టారు. ఇప్పటికే పెద్దపులి తిరుగుతున్న పరిసర ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో కెమెరాల్లో పులి కదలికలు రికార్డు కాలేదు. ఆ తరువాత తిరిగి పులి జాడ లేకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు పెద్దారవీడు మండలంలో పెద్దపులి రెండు ఆవులపై దాడి చేసి ఒక ఆవును చంపేయడంతో స్థానికులు, రైతులు పొలాలకు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు.
సిసి కెమెరాల్లో గుర్తింపు..
గత ఏడాది జనవరి, అక్టోబర్ నెలల్లో అటవీ శాఖ అధికారులు పులి సంచారాన్ని ధ్రువీకరిస్తూ పాదాల ముద్రలను సేకరించారు. రాత్రి వేళల్లో పెద్దపులి సంచారాన్ని కనిపెట్టేందుకు అక్కడక్కడ సిసి కెమెరాలను అమర్చారు. ఓ కెమెరాలో పెద్దపులి జాడలు గుర్తించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్ – శ్రీశైలం అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య పెరగడంతో ఆహారంకోసం అభయారణ్యం దాటి వస్తున్నాయని భావిస్తున్నారు. అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో గ్రామాలు ఉండడంతో పెద్దపులి ఆహారం కోసం తిరుగుతూ ఉందని మేత కోసం పశువులను అడవిలోకి పంపవద్దని రైతులకు అటవీ శాఖ అధికారులు సూచించారు. అధికారులు కూడా పాదముద్రలను పరిశీలించి అవి పెద్దపులివిగా నిర్ధారించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..