AP News: ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి

ప్రకాశం జిల్లాలో ఆడశిశువు విక్రయం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాలల సంరక్షణశాఖ అధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆడ శిశువును పెంచడం ఇబ్బంది కావడంతో తన బంధువుల్లో ఓ మహిళకు 6 వేలకు తన బిడ్డను అమ్మేసింది ఓ తల్లి. ఆమెను నెల్లూరు జిల్లా పొన్నలూరు గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్‌ మంజులగా గుర్తించారు.

AP News: ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి
Child
Follow us

|

Updated on: Aug 26, 2024 | 8:55 PM

ప్రకాశం జిల్లాలో ఆడశిశువు విక్రయం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాలల సంరక్షణశాఖ అధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆడ శిశువును పెంచడం ఇబ్బంది కావడంతో తన బంధువుల్లో ఓ మహిళకు 6 వేలకు తన బిడ్డను అమ్మేసింది ఓ తల్లి. ఆమెను నెల్లూరు జిల్లా పొన్నలూరు గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్‌ మంజులగా గుర్తించారు. భర్తకు దూరంగా ఉంటూ వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుండగా ఆడ శిశువు పుట్టడంతో పెంచలేక అమ్మేసింది. తల్లి నుంచి బిడ్డను తీసుకుని 6 వేలు చెల్లించిన ఆ మహిళ.. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన దంపతులకు పెంచుకునేందుకు 10 వేలకు అమ్మేసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఐసిడియస్‌ అధికారుల ఫిర్యాదుతో పొన్నలూరు పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది…ఖమ్మం జిల్లాలో ఉన్న ఆడ శిశువును స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వెనక్కి రప్పించి తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం శిశువును ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

ఈనెల 24న ఒంగోలులోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంజుల తన బిడ్డతో సహా వైద్య సిబ్బందికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది… అనంతరం తన ఆడశిశువును ఖమ్మం జిల్లాలోని బాలసుందర్రావు దంపతులకు పెంచుకునేందుకు ఇచ్చేసింది… అందుకుగాను బాలసుందర్రావు 10 వేలు చెల్లించగా తల్లి మంజుల 6 వేలు, బిడ్డను ఇచ్చేందుకు మద్యవర్తిత్వం వహించిన మహిళ 4 వేలు తీసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తల్లి, బిడ్డ ఈనెల 24న చెప్పకుండా వెళ్లిపోయినట్టు తెలుసుకున్న బాలల సంక్షేమ శాఖ సిబ్బంది దీనిపై ఆరా తీశారు. చట్టవ్యతిరేకంగా బిడ్డను మరొకరికి ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తల్లి మంజుల పొన్నలూరులో ఉండటంతో ఆమెపై బాలల సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడశిశువు జన్మించడంతో పోషించలేక వేరే దంపతులు పెంచుకుంటానంటే ఇచ్చానని బిడ్ద తల్లి మంజుల తెలిపారు. శిశు విక్రయం వ్యవహారంలో ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మ తిడుతుందని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.. పాపం...
అమ్మ తిడుతుందని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.. పాపం...
అంగారకుడి ఉపరితలం కింద ఆవులు దాగి ఉండవచ్చు! శాస్త్రవేత్త ప్రకటన
అంగారకుడి ఉపరితలం కింద ఆవులు దాగి ఉండవచ్చు! శాస్త్రవేత్త ప్రకటన
బెల్లీ ఫ్యాట్.. వీటిని వదిలిస్తే స్లిమ్ అవ్వడం ఈజీనే..
బెల్లీ ఫ్యాట్.. వీటిని వదిలిస్తే స్లిమ్ అవ్వడం ఈజీనే..
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్లు చక్కెర తినాలో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్లు చక్కెర తినాలో తెలుసా?
మీ బైక్‌ పెట్రోల్ ట్యాంక్‌లోని నీరు చేరిందా? స్టార్ట్‌ కావడం లేదా
మీ బైక్‌ పెట్రోల్ ట్యాంక్‌లోని నీరు చేరిందా? స్టార్ట్‌ కావడం లేదా
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు.. ఎందుకంటే
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు.. ఎందుకంటే
లక్ష రూపాయల్లో లక్షణమైన టూవీలర్స్..!
లక్ష రూపాయల్లో లక్షణమైన టూవీలర్స్..!
ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు.. ఏం జరగబోతోంది?
ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు.. ఏం జరగబోతోంది?
ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి
ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి
కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈచిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్..
కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈచిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్..
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!