Andhra Pradesh: ఇక దబిడి దిబిడే.. డ్రగ్స్‌పై పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌..

ఏపీలో డ్రగ్స్‌, ఇతర మత్తుపదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పెద్దయెత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత 100 రోజులపాటు గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Andhra Pradesh: ఇక దబిడి దిబిడే.. డ్రగ్స్‌పై పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌..
Ganja
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 26, 2024 | 8:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో గత 100 రోజులపాటు గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడ కేంద్రంగా ఇప్పటివరకు 200 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నట్లు డీసీపీ హరికృష్ణ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న 120 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై 35 కేసులు నమోదు చేశామని చెప్పారు. మత్తు పదార్థాలు సేవించే 150 ప్రాంతాలను గుర్తించామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెడుతున్నామన్నారు. ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. ఒడిశా నుంచి ఏపీకి తరలిస్తోన్న 912 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తుండగా.. అనకాపల్లి జిల్లా గుల్లేపల్లిలో దగ్గర కోటి విలువ చేసే గంజాయిని పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అరెస్టుచేయాల్సి ఉందని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ కోటిరూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఒడిషా, విశాఖ అరకు నుండి గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు…ప్రధాన రహదారుల్లో అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..