Andhra: పోలీసులు న్యాయం చేయలేదని తల్లీకూతురు ఏం చేశారో తెలుసా..?

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న పలువురు పోలీసు అధికారుల ఫోటోలను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.

Andhra: పోలీసులు న్యాయం చేయలేదని తల్లీకూతురు ఏం చేశారో తెలుసా..?
Mother-Daughter Morphed Police Photos,

Edited By:

Updated on: Dec 19, 2025 | 5:58 AM

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న పలువురు పోలీసు అధికారుల ఫోటోలను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. పోలీసుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న తల్లి కూతురును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు

వివరాల ప్రకారం.. మార్తమ్మ, ఆమె కూతురు బందెల స్పందన.. ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామానికి చెందిన వారు.. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీరు కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఎందుకో ఏమో గాని వీరిద్దరూ పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ.. యూనిఫాంలో ఉన్న పోలీస్ అధికారుల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో ఫొటోలను ఎడిటింగ్ చేసేవారు.. ఆ తర్వాత ఆ ఫోటోలను వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ ,ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలలో పోస్టింగ్ చేస్తున్నారు.

తల్లికూతుళ్లు ఇద్దరూ గత కొన్నిరోజులుగా ఇదే విధంగా చేస్తుండటంతో.. పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. పోలీసులు ఎంత వారించినా వారు పద్ధతి మార్చుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓ కేసు వ్యవహారంలో వారికి న్యాయం జరగలేదని తరచూ పోలీస్ స్టేషన్ రావడం పోలీసులతో గొడవ పెట్టుకోవడం జరుగుతుందని.. పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కొద్దిరోజులుగా కోవెలకుంట్ల , సంజమల రేవనూరు, ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసిన పోలీస్ అధికారులు, పోలీసు దుస్తుల్లో ఉన్న అధికారుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో తరచూ పదేపదే పోస్టింగులు పెడుతూ ఉండడంతో వీరిపై కేసులు నమోదు చేసి.. ఈ ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. వీరి నుండి రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు..

వీడియో చూడండి..

గతంలో వీరిపై కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు ఉన్నాయి. 6- 5- 2025లో కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి పోలీసుల పైన దౌర్జన్యం చేసినందుకు పోలీసులు వీరిపై కేసు నమోదు అయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..