AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వీరి క్రైమ్ కహాని ఏంటో తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం

ఈ క్రైమ్ కహాని పక్కాగా మీరు తెలుసుకోవాల్సిందే. గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన కస్తూరి శ్రీనివాసరావు, సాంబశివరావు కొద్దీ మొత్తంలో బంగారం కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.

Andhra Pradesh: వీరి క్రైమ్ కహాని ఏంటో తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం
Ap Crime News
Ram Naramaneni
|

Updated on: Mar 13, 2022 | 7:52 PM

Share

Guntur District: ఈ క్రైమ్ కహాని పక్కాగా మీరు తెలుసుకోవాల్సిందే. గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన కస్తూరి శ్రీనివాసరావు, సాంబశివరావు కొద్దీ మొత్తంలో బంగారం కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. చెన్నై నుండి బంగారం కొనుగోలు చేసి తీసుకురావటానికి స్థానికులకు కమీషన్ ఇచ్చి పంపుతుంటారు. స్థానికులు ఇక్కడ నుండి డబ్బులు తీసుకెళ్ళి చెన్నై లో బంగారు కొని తీసుకొచ్చి దుర్గి వ్యాపారులకు అందిస్తుంటారు‌. అదే విధంగా ఈ నెల 8వ తేదిన 89 లక్షల రూపాయలను స్థానికులైన ప్రకాశ రావు, అజయ్ కుమార్, రామ శేషయ్య లో కిచ్చిన చెన్నై వెళ్ళి బంగారం తీసుకు రావాలని చెప్పారు. డబ్బులను బ్యాగులో సర్థుకున్న ముగ్గురు సాయంత్రం ఆరు గంటల సమయంలో నడికుడి రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. చెన్నై వెళ్ళే రైలు కోసం రెండో నెంబర్ ప్లాట్ ఫాంపై ముగ్గురు వేచి చూస్తున్న సమయంలో ఐదుగురు వ్యక్తులు తెల్ల కారులో దిగారు. రైలు కోసం వేచి చూస్తున్న ముగ్గురి వద్దకు వచ్చి తాము పోలీసులమని ఎస్సై గారు రమ్మంటున్నారని వారికి చెప్పారు. అయితే ఆ ముగ్గురు తామెందుకు రావాలని ప్రశ్నించడంతో ఐదుగురు వారిపై దాడి చేసి వారి వద్ద నున్న బ్యాగ్ తీసుకొని వచ్చిన కారులోనే పారిపోయారు.

ఒక్కసారిగా అవాక్కైన ఆ ముగ్గురు రైల్వే జిఆర్పిఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 89 లక్షలు చోరి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు చాలెంజింగ్ తీసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నడికుడి రైల్వేస్టేషన్ లో సిసి కెమెరాలు పనిచేయకుపోటంతో నిందితులను పట్టుకోవటం కష్టంగా మారింది. అయితే గ్రామానికి చెందిన అవారా గాళ్ళు, పాత నేరస్థులుపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే రమేష్ అనే వ్యక్తి గతంలో రెండుసార్లు కమీషన్ కోసం బంగారం తీసుకురావడానికి చెన్నై వెళ్ళినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసును చేధించారు‌. దొంగిలించిన బ్యాగ్ ను అడిగొప్పల వద్ద గుంత తీసి గుంతలో దాచిపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన కేసులో పోలీసులు వెంటనే నిందితులను పట్టుకొని మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ సిబ్బందిని రైల్వే ఎస్పీ అనిల్ బాబు అభినందించారు.

రిపోర్టర్:టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు

Also Read: Andhra Pradesh: సేద తీరేందుకు చెట్టు కిందకు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెన్నులో వణుకు

Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..