Andhra: ఓర్నీ..! ముసురులో ఫ్రీగా చేపలు.. ఊరు ఊరంతా పండగ చేసుకున్నారు.. వీడియో

ఒకవైపు మొంథా తుఫాను ప్రభావంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతుంటే.. మరోవైపు ఫ్రీగా చేపలు దొరుకుతున్నాయంటూ జనం ఎగబడ్డారు.. పొలాల్లోని చేపలను అందినకాడికి పట్టుకుని పండగ చేసుకుంటున్నారు... అసలు పొలాల్లో చేపలు ఎలా వచ్చాయని అనుకుంటున్నారా... అయితే ఈ కథనం చదవండి..

Andhra: ఓర్నీ..! ముసురులో ఫ్రీగా చేపలు.. ఊరు ఊరంతా పండగ చేసుకున్నారు.. వీడియో
Ongole Villagers Catch Fish

Edited By:

Updated on: Oct 27, 2025 | 1:53 PM

ఒకవైపు మొంథా తుఫాను ప్రభావంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతుంటే.. మరోవైపు ఫ్రీగా చేపలు దొరుకుతున్నాయంటూ జనం ఎగబడ్డారు.. పొలాల్లోని చేపలను అందినకాడికి పట్టుకుని పండగ చేసుకుంటున్నారు… అసలు పొలాల్లో చేపలు ఎలా వచ్చాయని అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే.. ఒంగోలు సమీపంలోని పెళ్ళారు చెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది.. చెరువు నిండి గ్రామంవైపు గండి పడితే ఊరు మునిగి పోయే ప్రమాదం ఉండటంతో పొలాల వైపు గండికొట్టి నీటిని బయటకు విడిచిపెట్టారు. దీంతో చెరువులో పెంచుతున్న చేపలు గండి కాలువ నుంచి సమీపంలోని పొలాలకు వచ్చి చేరాయి. పొలాల్లో నీటిలో చేపలు ఈదడానికి ఇబ్బందులు పడుతూ ఎగిరెగిరి పడటాన్ని దారిన పోయే దానయ్యలు చూశారు.. అంతే సమాచారం ఊరంగా దావానంలా వ్యాపించింది.

వెంటనే వలలు, ప్లాస్టిక్‌ బస్తాలు తీసుకుని జనం పొలాల్లోకి ఎగబడ్డారు.. ఎగిరెగిరి పడుతున్న చేపలను ఒడిసి పట్టుకుని గోతాల్లో నింపుకున్నారు.. అసలే మొంథా తుఫాను ప్రభావంతో వాతావరణం చల్లగా ఉండటంతో వేడి వేడిగా చేపల పులుసు చేసుకుని తినొచ్చంటూ సంబరపడుతూ ఇంటి బాట పట్టారు. పెళ్ళూరు చెరువు దగ్గర నెలకొన్న ఈ దృశ్యం ఇళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలని అడిగాడట మరొకడు.. అన్న సామెత గుర్తురాక మానదు.. ఏది ఏమైనా.. ఇదే అదును చేపలు పట్టుకుంటూ ఊరు ఊరంతా సందడి చేస్తుకనిపించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..