Andhra Pradesh MLC elections: ఏపీలో మొదలైన ఎమ్మెల్సీల నామినేషన్లు.. హీటెక్కిస్తున్న పొలిటికల్ కామెంట్స్..
ఏపీలో ఎమ్మెల్సీల నామినేషన్ల పర్వం మొదలైంది. అభ్యర్థుల నామినేషన్లతో రాజకీయ సందడి కనిపించింది. ప్రచార పర్వానికి ముందే పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు హీటెక్కిస్తున్నాయి. విశాఖలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల..
ఏపీలో ఎమ్మెల్సీల నామినేషన్ల పర్వం మొదలైంది. అభ్యర్థుల నామినేషన్లతో రాజకీయ సందడి కనిపించింది. ప్రచార పర్వానికి ముందే పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు హీటెక్కిస్తున్నాయి. విశాఖలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల కోలాహలం అంబరాన్నంటింది. మంత్రి బొత్స నారాయణ, వైవీ సుబ్బారెడ్డిలు.. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు టీడీపీ అభ్యర్థి చిరంజీవికి మద్దతుగా తరలివచ్చారు అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి రాజు. మరోవైపు బీజేపీ అభ్యర్థి మాధవ్ నామినేషన్‌లో.. ఆసాతం వెంట ఉన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.
అనంతపురంలో వైసీపీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, మంగమ్మ నామినేషన్ వేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామంచంద్రారెడ్డికి వైసీపీ మద్దతు ఉంటుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ముగ్గురి విజయానికి పార్టీ కృషి చేస్తుందన్నారు. చిత్తూరు జిల్లాలో పట్టభద్రుల స్థానానికి ఏడు.. ఉపాధ్యాయ స్థానాలకి ఒక నామినేషన్ దాఖలైంది. స్థానిక సంస్థల కోటా స్థానానికి ఒక్క నామినేషన్ కూడా పడలేదు. బరిలో మాత్రం వైసీపీ, టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థులు ఉన్నారు.
వైసీపీ తరపున కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారాయన. టీడీపీ, బీజేపీలకు సంఖ్యాబలం లేదని.. తన ఎన్నిక ఏకగ్రీవం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారని కొనియాడారు మంత్రి రోజా. ఆ క్రెడిట్ ముఖ్యమంత్రికి రాకుండా చంద్రబాబు అండ్ కో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా మేరుగ మురళి నామినేషన్ వేశారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైనల్‌గా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీల అభ్యర్థులు ప్రచారంలో హీట్ పెంచేందుకు రెడీ అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..