
నాన్న.. మరి నేనెవర్ని..? అంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డికి శివ చరణ్ రెడ్డి రాసిన లేఖ ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శివ చరణ్ రెడ్డి, అతని తల్లి లక్ష్మీదేవి చేసిన ఆరోపణలు.. సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి తీవ్రంగా స్పందించారు. శివచరణ్-లక్ష్మీదేవి ఆరోపణలను ఖండించారు. శివచరణ్ రాసిన లేఖ అంతా బోగస్ అని అన్నారు. తనను బ్లాక్ మెయిల్ చెయ్యడానికే ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారే మేకపాటి. లక్ష్మీ దేవి భర్త కొండారెడ్డి అని, ఈ విషయం వారి స్వగ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. తనకు కొడుకులు లేరని మరోసారి స్పష్టం చేశారు. 29 ఏళ్లుగా శాంతమ్మతో ఉన్న అనుబంధాన్ని ఈ రోజు చెబుతున్నానంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. తనకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారని, మగ పిల్లలు లేరని స్పష్టం చేశారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే.
ఇదిలాఉంటే.. ముమ్మాటికి తన తండ్రి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డేనని.. ఆయన కాదంటే చట్టపరంగా పోరాడతానని శివ చరణ్ అంటున్నాడు. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..