MLA Dwarampudi: పవన్ ఓ రాజకీయ వ్యభిచారి.. దమ్ముంటే నా మీద పోటీ చేయాలి.. ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్

MLA Dwarampudi Chandrasekhar Reddy: వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి.. జనసేన ఎవరి బాగు కోసం.. రాష్ట్రం కోసమా.. చంద్రబాబు కోసమా అంటూ పవన్ పై ధ్వజమెత్తారు.

MLA Dwarampudi: పవన్ ఓ రాజకీయ వ్యభిచారి.. దమ్ముంటే నా మీద పోటీ చేయాలి.. ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్
Mla Dwarampudi

Updated on: Jun 19, 2023 | 12:06 PM

MLA Dwarampudi Chandrasekhar Reddy: వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి.. జనసేన ఎవరి బాగు కోసం.. రాష్ట్రం కోసమా.. చంద్రబాబు కోసమా అంటూ పవన్ పై ధ్వజమెత్తారు. పవన్ ప్యాకేజీ స్టార్ అన్న విషయం అందరికీ తెలుసని.. ఆయన చంద్రబాబు కోసమే పనిచేస్తారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అనేవ్యక్తి రెడ్డి ద్వేషి.. కులాల మధ్య చిచ్చు పెట్టడమే అతని లక్ష్యం అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. కాకినాడలో రెడ్డి సామాజిక వర్గం తక్కువని.. అయినా తాను గెలిచానని పేర్కొన్నారు. పవన్ కు దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.. నా అంతు చూస్తానన్నావ్.. రాబోయే రోజుల్లో నీ అంతు చూస్తా.. నిన్ను తుక్కు తుక్కుగా ఓడించకపోతే.. నాపేరు చంద్రశేఖర్ రెడ్డే కాదంటూ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్.. దేహి దేహి అని అడుక్కోనైనా పోటీ చేయాలని.. అప్పుడు తానేంటో చూపిస్తానంటూ ద్వారంపూడి సవాల్ చేవారు. చంద్రబాబుతో బేరం కుదరక ఇప్పుడు వచ్చారని.. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. తాను తలుచుకుంటే.. బ్యానర్ కూడా కట్టనివ్వనంటూ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో జీరో అంటూ వ్యాఖ్యానించారు.

ద్వారంపూడి గూండా, రౌడీ.. ఆయన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తా.. అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో ఫైర్ అయ్యారు. మొన్న జనసేన కార్యకర్తల సమావేశంలో సైతం ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కల్యాణ్‌. అతని రౌడీయిజానికి భయపడేదే లేదని.. పేర్కొన్నారు. తొడగొట్టి మరీ చెప్పిన పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే ద్వారంపూడి ఓడించి తీరతానంటూ శపథం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..