పర్యావరణ హితమే లక్ష్యంగా..ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంక మట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు.తిరుచానూరు మార్కెట్ యార్డ్‌లో 1లక్ష 24 వేల బంక మట్టి విగ్రహాల తయారీని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి మిశ్రమాన్ని కలపడంలో కుమ్మరి కార్మికులతో కలిసి పాలుపంచుకున్నారు.కాలక్రమేణ పాత సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. పెద్దల సూచనల మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో.. ప్రతి ఏటా, ప్రతి ఇంటికి బంక మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పంపిణీతో పాటు పూజించేలా ప్రోత్సహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఇందులో భాగంగా ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున ఒక లక్ష 24 వేల మట్టి విగ్రహాలు తయారీకి శ్రీకారం చుట్టామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాలలో.. 7 వందల మంది కుమ్మరి కార్మికులు గడిచిన 25 రోజులుగా బంకమట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. ఈ బొమ్మల తయారీకి సుమారు 2,500 టన్నుల బంకమట్టి 90 ట్రిప్పర్లతో తెప్పించమన్నారు.
అంతే కాకుండా ప్రజలకు గణనాథుని పూజించే విధానం పుస్తకాలను రూపొందించారు. మట్టి వినాయక విగ్రహాలతో పాటు పుస్తకాలను అందించనున్నారు..ఈ మట్టి వినాయక విగ్రహాలను ఇంటింటికి పంపిణీ చేయడంలో 2 వేల మంది వాలంటీర్లు భాగస్వామ్యులు కానున్నారు..ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం