Minister Roja: కక్ష సాధింపునకు దిగితే టీడీపీ, జనసేన నేతలు ఏపీలో తిరగలేరు.. మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్..
కుప్పం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధించడంతో.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన కుప్పం ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు...

కుప్పం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధించడంతో.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన కుప్పం ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అడ్డుకోవడం కలకలం రేపింది. దీంతో పోలీసులు, ప్రభుత్వం తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాగా.. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రులు కూడా తమదైన శైలిలో ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. మనసున్న నాయకుడు సీఎం జగన్ ను చంద్రబాబు సైకో అనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దేశంలో ఎవరైనా పెద్ద సైకో ఉన్నారంటే అది చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు చిత్తూరులో జన్మించడం తమకు అవమానకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ప్రభుత్వం జీఓ నెం.1 తీసుకొస్తే.. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని మంత్రి రోజా అన్నారు.
ప్రజల ప్రాణాలను వరుసగా తీసిన చంద్రబాబు ఉన్మాది. సీఎం జగన్ కక్ష సాధింపునకు దిగితే టీడీపీ, జనసేన నాయకులు ఏపీలో తిరగలేరు. మీలాంటి వారి గురించి సీఎం జగన్ టైం వేస్ట్ చేయరు. కుప్పంలో చంద్రబాబు కూసాలు కదులుతున్నాయి. చంద్రబాబు సీఎం జగన్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. పవన్ కళ్యాణ్ ఇప్పటంలో గోడలకు ఇచ్చిన విలువ కూడా కందుకూరు, గుంటూరులో మృతులకు ఇవ్వలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సీఎం జగన్ రాజకీయ సమాధి కట్టేస్తారు.
– రోజా, ఆంధ్రప్రదేశ్ మంత్రి




మరోవైపు.. కుప్పం ఘటనపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు వారంతా చూశారన్న చంద్రబాబు.. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం పాదయాత్ర, మీటింగ్ లు పెట్టారని గుర్తు చేశారు. ఎక్కడా ఆటంకం కలిగించలేదన్నారు.. జగన్ కు పిరికితనం, ఓటమి భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కొందరు పోలీసుల తీరు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా ఉందని ఫైర్ అయ్యారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..