Minister RK Roja: కుటుంబ సభ్యులు అలా చేసుంటే ఎన్టీఆర్ దేశ ప్రధాని అయ్యేవారు.. మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ ను తమ ఇంటి అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినప్పుడు.. చంద్రబాబుని కుటుంబ సభ్యులు మెడ పెట్టి బయటకు గెంటేసి ఉంటే బాగుండేదని.. ఈరోజు ఎన్టీఆర్ ప్రధానమంత్రి స్థాయిలో ఉండేవారంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Minister RK Roja: కుటుంబ సభ్యులు అలా చేసుంటే ఎన్టీఆర్ దేశ ప్రధాని అయ్యేవారు.. మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
Minister Roja On Ntr

Updated on: Sep 26, 2022 | 4:30 PM

Minister RK Roja on NTR: గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయాలు హీట్ హీట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సీఎం జగన్ ప్రభుత్వం పేరు మార్చిన అనంతరం.. వైసీపీ నేతలు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుకుంది.  మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై మళ్ళీ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు తీరుఫై రోజా తనదైన శైలిలో విరుచుకుని పడ్డారు. ఎన్టీఆర్ బతికుండగా ఆయన్ని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని.. అప్పుడు ఆయన్ని బాగా చూసుకొని..  అన్నం పెట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు రోజా. ఎన్టీఆర్ ను తమ ఇంటి అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినప్పుడు.. చంద్రబాబుని కుటుంబ సభ్యులు మెడ పెట్టి బయటకు గెంటేసి ఉంటే బాగుండేదని.. ఈరోజు ఎన్టీఆర్ ప్రధానమంత్రి స్థాయిలో ఉండేవారంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

బతికుండగానే ఎన్టీఆర్ ను చంపేసిన చంద్రబాబు, అయన కుటుంబ సభ్యులకు సీఎం జగన్ పై మాట్లాడే అర్హత లేదన్నారు. రాజధాని విషయంలో కోర్టులో గెలిచామని రాజధాని రైతులు సంబరపడుతున్నారు.. అయినప్పటికీ రాజధానిలు మూడు ఉంటాయని.. పాలన విశాఖ నుంచే జరుగుతుందని పేర్కొన్నారు మంత్రి రోజా. అయినప్పటికీ నిజాన్ని గుర్తించక రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికే అమరావతి రైతులు పాదయాత్రలు చేస్తున్నారంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రైతులు ఎక్కడైనా వాకీటాకీలు, ఐఫోన్ వాచ్ లు పెట్టుకొని తొడలు కొడతారా అంటూ ప్రశ్నలు సంధించారు. అయినాయి అసలు ఆ పార్టీలో ఏంటో ఆడవాళ్లు తొడలు కొడతారు.. మగవాళ్ళు ఏడుస్తారు..  జంబలకడిపంబ తరహాలో ఆ పార్టీ తయారయిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి ఆర్కే రోజా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..