Kirrak RP Restaurant: తిరుపతిలోనూ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్.. మంత్రి ఆర్కే రోజా ప్రారంభం

| Edited By: Srilakshmi C

Nov 21, 2023 | 7:20 AM

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న కిరాక్ ఆర్పీ టెంపుల్ సిటీలో రెస్టారెంట్ ప్రారంభించాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. కీరాక్ ఆర్పీ రెస్టారెంట్ ఓపెనింగ్ లో సినీ నటి మెహరీన్ సందడి చేసింది. తిరుపతిలో అవుట్ లెట్‌ను మంత్రి ఆర్కే రోజా చేత ప్రారంభించిన కిరాక్ ఆర్పీ త్వరలోనే తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఫ్రాంచేజీ లను ఇస్తున్నామన్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా చేపల వంటకాలను..

Kirrak RP Restaurant: తిరుపతిలోనూ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్.. మంత్రి ఆర్కే రోజా ప్రారంభం
Nellore Peddareddy Chepala Pulusu Outlet
Follow us on

తిరుపతి, నవంబర్‌ 21: జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న కిరాక్ ఆర్పీ టెంపుల్ సిటీలో రెస్టారెంట్ ప్రారంభించాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. కీరాక్ ఆర్పీ రెస్టారెంట్ ఓపెనింగ్ లో సినీ నటి మెహరీన్ సందడి చేసింది. తిరుపతిలో అవుట్ లెట్‌ను మంత్రి ఆర్కే రోజా చేత ప్రారంభించిన కిరాక్ ఆర్పీ త్వరలోనే తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఫ్రాంచేజీ లను ఇస్తున్నామన్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా చేపల వంటకాలను అందుబాటులో తెచ్చామన్నారు.

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు విశేష ప్రజాదరణ అందుకుందన్నారు. ఆర్పీ రెస్టారెంట్‌లో కొరమేను, గండి, రవ్వ, సన్న చేపలు, తలకాయ చేపల పులుసు, బొమ్మిడాయల పులుసుతో పాటు.. రాగి సంగటి రుచికరంగా అందిస్తున్నట్లు అవుట్ లెట్ నిర్వహకులు తెలిపారు. కిరాక్ ఆర్పీ కి చెందిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ను తిరుపతి మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిలతో కలిసి మంత్రి రోజా ప్రారంభించారు. సినీ నటి మెహరీన్ తో కాసేపు సందడి చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు జబర్దస్త్ ఆర్పీ నెల్లూరు చేపల పులుసును అందుబాటులోకి తీసుకుని వచ్చారన్నారు. తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించిన కిరాక్ ఆర్పీని మంత్రి రోజా అభినందించారు. కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు చేపల పులుసు తినడం లేదని, ఆ తరువాత వచ్చి రుచి చూస్తానన్నారు ఆర్కే రోజా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.