బొత్స సత్యనారాయణపై గంగులకమాలాకర్ ఫైర్.. ఇంకా విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం

|

Jul 13, 2023 | 3:59 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యాలపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం రాకముందు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా ఉన్నారని.. అప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని మండిపడ్డారు.

బొత్స సత్యనారాయణపై గంగులకమాలాకర్ ఫైర్.. ఇంకా విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం
Gangula Kamalakar
Follow us on

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యాలపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం రాకముందు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా ఉన్నారని.. అప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని మండిపడ్డారు. స్వరాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణలో విద్యావ్యవస్థ మెరుగుపడిందన్నారు. రాష్ట్రం రాకముందు తెలంగాణలో కేవలం 297 మాత్రమే గురుకులాలు ఉండేవని.. ఆంధ్ర నాయకుల వైఫల్యం వల్ల ఎంతోమంది చదవలేకపోయారన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 1009 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు గురుకులాల్లో చదువుకుంటున్నారని తెలిపారు.

ప్రస్తుతం ఏపీలో 380 గురుకులాలు మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని కూడా పదవ తరగతి వరకు మాత్రమే పరిమితం చేశారన్నారు. టీఎస్‌పీఎస్సీలో తప్పు జరిగితే ప్రభుత్వం వాళ్లని శిక్షిస్తోందని అన్నారు. కానీ ఏపీలో ఉద్యోగాలను దొంగదారిలో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అక్కడ ఎమ్మెల్యేలు ,APPSC మెంబర్లే డబ్బులు వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించాలని సవాల్ చేశారు.

ఇవి కూడా చదవండి