Watch Video: ఎన్నికల నగారా కంటే ముందే మోగిన బుల్లెట్ ప్రచార మోత..

| Edited By: Srikar T

Mar 03, 2024 | 4:17 PM

పల్నాడు జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రాజకీయ ప్రచారాలు జోరందుకున్నాయి. వచ్చే ఎన్నికలను చావో రేవుగా ఇరు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుండే ప్రజల వద్దకు వెళుతూ వారికి అండగా ఉంటున్నామన్న భావన కల్గిస్తున్నారు పార్టీ నేతలు. ఇందులో భాగంగా సత్తెనపల్లిలో రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారాయి. ఎప్పుడు వార్తల్లో ఉండే మంత్రి అంబటి రాంబాబు, ఎన్నికల ప్రచారంలో కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు.

Watch Video: ఎన్నికల నగారా కంటే ముందే మోగిన బుల్లెట్ ప్రచార మోత..
Minister Ambati Rambabu
Follow us on

పల్నాడు జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రాజకీయ ప్రచారాలు జోరందుకున్నాయి. వచ్చే ఎన్నికలను చావో రేవుగా ఇరు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుండే ప్రజల వద్దకు వెళుతూ వారికి అండగా ఉంటున్నామన్న భావన కల్గిస్తున్నారు పార్టీ నేతలు. ఇందులో భాగంగా సత్తెనపల్లిలో రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారాయి. ఎప్పుడు వార్తల్లో ఉండే మంత్రి అంబటి రాంబాబు, ఎన్నికల ప్రచారంలో కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి సత్తెనపల్లి నుండే పోటీ చేస్తున్న రాంబాబు తిరిగి విజయం సాధించాలనుకుంటున్నారు. విచిత్ర ప్రచారాలు ఆయన అప్పుడే తెరదీశారు. పది రోజుల క్రితం బుల్లెట్ పై పట్టణంలో పర్యటించి అభిమానులు, కార్యకర్తల్లో జోష్ పెంచారు. ఆ తర్వాత టీ స్టాల్ కు వెళ్లి టీ పెట్టి ఇచ్చారు. టిఫిన్ బండి వద్ద దోశె, పూరి వేశారు. ఇలా ప్రచారంలో తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టకునే ప్రయత్నం చేస్తున్నారు.

బుల్లెట్ పై ప్రయాణిస్తూ అభిమానులతో కలిసి చేసిన ప్రచారంపై అంబటి కూడా తెగ నచ్చేసినట్లుంది. బైక్ పైనే ప్రయాణించి స్థానికులను కలవడం, వారి సమస్యలు వినడం కూడా సులభంగా ఉన్నట్లు రాంబాబు అభిమానులతో చెప్పారు. దీంతో వెంటనే ఆయన ఒక బుల్లెట్ కు ఆర్డర్ ఇచ్చేశారు. బుల్లెట్ రాగానే మాదలలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేయించారు. తీరా అంబటి ఏంటి బుల్లెట్ ఏంటి అని అభిమానులు ఆరా తీయగా.. ఆయన మనస్సులో మాట చెప్పేశారు. వచ్చే ఎన్నికల ప్రచారంలో ఎక్కువ దూరం బుల్లెట్ పైనే ప్రయాణిస్తూ ప్రచారం చేయాలనుకుంటున్నట్లు చెప్పేశారు. ప్రచారంలో స్థానికులు వద్ద వెళ్లడానికి కూడా అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

సత్తెనపల్లి నియోజవకర్గంలో నకరికల్లు, రాజుపాలెం, ముప్పాళ్ల, సత్తెనపల్లి రూరల్ మండలాలు ఉన్నాయి. రూరల్ మండలాల్లోని గ్రామాల్లో బుల్లెట్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దీంతో ఆయా గ్రామాల్లో బుల్లెట్ పైనే ప్రయాణిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లాలని అంబటి ఫిక్స్ అయ్యారు. అంబటి బుల్లెట్ కథ తెలుసుకున్న ఆయన అభిమానలు కూడా తెగ మెచ్చుకుంటున్నారు. అంబటితో పాటు తమ బుల్లెట్లపై ప్రయాణించేందుకు వారు సిద్దమయ్యారు. సత్తెనపల్లి నుండి మాదల వరకూ జరిగిన ర్యాలీలో అంబటితో పాటు అనేక మంది పాల్గొన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో వినూత్న ప్రచారం తప్పదని అందరూ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..