Srikakulam: అగ్గిపుల్ల మొనపై సూక్ష్మ దీపం.. బంగారు రేకుతో రూపొందించిన చిత్రకారుడు..

| Edited By: Surya Kala

Nov 13, 2023 | 11:48 AM

ప్రజలందరూ కాలుష్య రహిత దీపావళి చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ లోగోను రూపొందించినట్లు చెబుతున్నాడు కొత్తపల్లి రమేష్. గతంలోని ప్రత్యేక పర్వదినాలు, పండగల వేళ కూడా రమేష్ సూక్ష్మ కళా రూపాలను రూపొందించి అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు. క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోన్న నేపద్యంలో తాజాగా బంగారంతో సూక్ష్మ వరల్డ్ కప్ ను రూపొందించారు రమేష్.

Srikakulam: అగ్గిపుల్ల మొనపై సూక్ష్మ దీపం.. బంగారు రేకుతో రూపొందించిన చిత్రకారుడు..
Small Deepam
Follow us on

దీపావళి సందర్భంగా అతి చిన్న దీపాన్ని పలుచటి బంగారపు రేకు ఉపయోగించి రూపొందించాడు శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ చిత్రకారుడు. అగ్గిపుల్ల మొనపై అమిరేటంత అతి చిన్న సైజ్ లో రూపుదిద్దుకున్న ఈ దీపం అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గకు చెందిన కొత్తపల్లి రమేష్ ఆచారి ఈ కళా రూపాన్ని రూపొందించాడు. దీని తయారీకి కేవలం 30 మిల్లీగ్రాముల బంగారాన్ని అనగా కేవలం 200 రూపాయలు విలువగల బంగారం ఉపయోగించి దీనిని తయారు చేసారు.

ప్రజలందరూ కాలుష్య రహిత దీపావళి చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ లోగోను రూపొందించినట్లు చెబుతున్నాడు కొత్తపల్లి రమేష్. గతంలోని ప్రత్యేక పర్వదినాలు, పండగల వేళ కూడా రమేష్ సూక్ష్మ కళా రూపాలను రూపొందించి అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు. క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోన్న నేపద్యంలో తాజాగా బంగారంతో సూక్ష్మ వరల్డ్ కప్ ను రూపొందించారు రమేష్. దీపావళి పండుగ పూట బంగారoతో రమేష్ తయారు చేసిన దీపం అందరిని ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..