Weather Report: ఓవైపు వర్షం, మరోవైపు ఎండ తీవ్రత.. తెలుగు రాష్ట్రాలను అలర్ట్‌ చేసిన వాతావరణ శాఖ

|

May 12, 2023 | 7:01 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం ఉండనుంది. ఓవైపు వర్షం, మరోవైపు ఎండ తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు..

Weather Report: ఓవైపు వర్షం, మరోవైపు ఎండ తీవ్రత.. తెలుగు రాష్ట్రాలను అలర్ట్‌ చేసిన వాతావరణ శాఖ
Weather Report
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం ఉండనుంది. ఓవైపు వర్షం, మరోవైపు ఎండ తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఏపీ వ్యాప్తంగా ఈ రోజు (శుక్రవారం) 60 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారి, గురువారం (నేడు) ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడుతూ శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతితీవ్ర తుఫానుగా మారనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత తన దిశను మార్చుకుంటూ క్రమంగా బలహీన పడనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది.

ఇక గత రెండు రోజులుగా నమోదవుతున్న దానికంటే ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో 41-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు, తెలంగాణలోనూ 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్రమైన వడగాల్పులు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..