AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. బడికి సెలవు కావడంతో అరటి తోటకు వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవు రోజున సరదాగా నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు, 12 ఏళ్ల శశి, 10 ఏళ్ల దీపన్ మృతి చెందారు. లోతు తెలియక నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఆ రెండు కుటుంబాల్లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యో దేవుడా.. బడికి సెలవు కావడంతో అరటి తోటకు వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Ap Crime News
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 3:06 PM

Share

సెలవుల్లో ఆట విడుపు కోసం.. పొలంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వ్యవసాయం కోసం తవ్విన నీటి కుంటలో లోతు తెలుసుకోకుండా ఆ ఇద్దరు విద్యార్ధులు ఈత కొట్టేందుకు ప్రయత్నించడం.. వారి ఆయువు తీసింది. ఈ విషాద ఘటన మార్కాపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిలో తవ్విన నీటి కుంటలో సరదాగా ఈతకు వెళ్ళి ఇద్దరు బాలురు మృత్యువాత పడ్డారు. మృతులు 4వ తరగతి చదవుతున్న 12 ఏళ్ళ శశి, 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ళ దీపన్ గా గుర్తించారు. ఈ రోజు స్కూల్ కు సెలవుదినం కావడంతో ఊరి పక్కన ఉన్న అరటి తోటకు సరదాగా వెళ్ళారు శశి, దీపన్‌లు.. నీటి కుంటలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయి ఊపిరి ఆడక మృతి చెందారు.

విషయం తెలుసుకున్న సీఐ అజయ్ కుమార్ తన సిబ్బందతో ఘటనా స్ధలానికి వెళ్ళారు. అప్పటికే విద్యార్థులు నీటి కుంటలో మృతి చెందడంతో స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీసారు. వెంటనే యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే ఇద్దరు విద్యార్థులు మరణించారని వైద్యులు తెలిపారు.

దీంతో మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు ఇంట్లో ఆడుతూ ఆనందంగా గడిపి వెళ్లిన చిన్నారులు.. మృతి చెందడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అయ్యో దేవుడా.. సెలవు రోజున తీవ్ర విషాదం.. ఈత కోసం వెళ్లి..
అయ్యో దేవుడా.. సెలవు రోజున తీవ్ర విషాదం.. ఈత కోసం వెళ్లి..
RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్‌ 2026 రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్
RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్‌ 2026 రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్
ఇలాంటి పోలీస్ అధికారి గల్లీకి ఒక్కడున్నా చాలేమో..!
ఇలాంటి పోలీస్ అధికారి గల్లీకి ఒక్కడున్నా చాలేమో..!
అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలా? 60 శాతం పెరిగిన గోల్డ్‌ రేట్లు!
అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలా? 60 శాతం పెరిగిన గోల్డ్‌ రేట్లు!
రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!
రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!
17 ఏళ్ల వయసు నుంచే అయ్యప్ప దీక్ష.. నాలో వచ్చిన మార్పులివే
17 ఏళ్ల వయసు నుంచే అయ్యప్ప దీక్ష.. నాలో వచ్చిన మార్పులివే
శ్రీశైలం మహాక్షేత్రంలో అపవిత్రం.. గుట్టురట్టు చేసిన పోలీసులు!
శ్రీశైలం మహాక్షేత్రంలో అపవిత్రం.. గుట్టురట్టు చేసిన పోలీసులు!
బైక్‌ను 100 స్పీడ్‌లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్‌చేస్తే
బైక్‌ను 100 స్పీడ్‌లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్‌చేస్తే
చివరి అవకాశం.. ఏప్రిల్ 16 లోపు ఈ పని చేయకపోతే మీ అకౌంట్ క్లోజ్
చివరి అవకాశం.. ఏప్రిల్ 16 లోపు ఈ పని చేయకపోతే మీ అకౌంట్ క్లోజ్
పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 ఫలితాలు ఎప్పుడంటే?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 ఫలితాలు ఎప్పుడంటే?