AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch :బైక్‌ను 100 స్పీడ్‌లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్‌ చేస్తే.. వీడియో తీస్తుండగా..

రోజురోజుకూ యువతిలో రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. సోషల్‌ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే యూపీలోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. ఓ యువతి తన స్నేహితుడితో పాటు ప్రమాదకరంగా బైక్‌ నడుపుతూ రీల్‌ తీసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch :బైక్‌ను 100 స్పీడ్‌లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్‌ చేస్తే.. వీడియో తీస్తుండగా..
Bike Accident
Anand T
|

Updated on: Apr 14, 2026 | 2:33 PM

Share

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీబాద్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఘజీయాబాద్‌కు చెందిన ఇక్రా అనే 19 ఏళ్ల యువతి తన స్నేహితుడు హషీమ్ (20)తో కలిసి యమహా R-15 స్పోర్ట్స్ బైక్‌పై బయటకు వెళ్లింది. అయితే ఈ క్రమంలో బైక్‌ను ఆమె నడుపుతానని.. హమీమ్‌తో చెప్పడంతో అతను బైక్‌ను ఇక్రాకు ఇచ్చాడు..దీంతో ఇక్రా బైక్‌ నడుపుతుండగా హమీమ్ వెనకనుంచి వీడియో తీస్తున్నాడు.. అయితే బైక్‌ అతివేగంగా ఉండటంతో అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇక్రా అక్కడికక్కడే మృతి చెందగా హమీమ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఇక్రా బైక్‌ నడుపుతున్నట్టు హమీమ్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్రా కనీసం హెల్మెట్‌ లేకుండా అతి వేగంగా బైక్ నడుపుతున్న దృశ్యాన్ని మనం వైరల్ వీడియోలో చూడవచ్చు.

అయితే ప్రమాద సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇక్రా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన హమీమ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే శనివారం ఉదయం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లినట్టు పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. హషీమ్ తండ్రి కమ్రుద్దీన్ తన కుమారుడికి ఫోన్ చేయగా తాము బయటకు వచ్చామని.. త్వరలోనే తిరిగి వస్తాం అని చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు