Andhra Pradesh: ఆడపిల్ల పుడితే లక్ష రూపాయల డిపాజిట్.. ఆ కాలనీ నిర్ణయం ఆదర్శప్రాయం..

ఏపిలోని రాజధాని అమరావతికి అత్యంత్య సమీపంలో ఉండే పట్టణం. ఇక్కడే ఉంది ఇందిరా నగర్.. రెండు రోజుల క్రితం స్థానిక నేత మునగపాటి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కాలనీ యువత సమావేశం అయింది. ఈ కాలనీలోని దాదాపు మూడు వందల మంది సభ్యులున్నారు. ఈ క్రమంలోనే అందరూ కలిసి ఆదర్శవంతంగా ఉండే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేశారు. కాలనీలో ఎవరికి ఆడపిల్ల పుట్టినా లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలన్న ఆలోచనపై చర్చించారు. అందరికీ ఈ ఆలోచన నచ్చడంతో వచ్చే ఏడాది నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకున్నారు.

Andhra Pradesh: ఆడపిల్ల పుడితే లక్ష రూపాయల డిపాజిట్.. ఆ కాలనీ నిర్ణయం ఆదర్శప్రాయం..
New Baby Girl

Edited By:

Updated on: Dec 03, 2023 | 4:53 PM

ఆడపిల్ల భారం అనే మూఢ నమ్మకం నుండి సమాజం బయటపడుతుంది. అయితే ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్ల చదువు, పెళ్లి వంటి వాటి కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడం తల్లిదండ్రులకి ఆర్ధిక సమస్యలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఆ కాలనీ వాసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ కాలనీ వాసులు ఏం చేశారనేగా మీ ప్రశ్న.. అయితే ఈ స్టోరీ చదవండి..

అది మంగళగిరి పట్టణం.. ఏపిలోని రాజధాని అమరావతికి అత్యంత్య సమీపంలో ఉండే పట్టణం. ఇక్కడే ఉంది ఇందిరా నగర్.. రెండు రోజుల క్రితం స్థానిక నేత మునగపాటి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కాలనీ యువత సమావేశం అయింది. ఈ కాలనీలోని దాదాపు మూడు వందల మంది సభ్యులున్నారు. ఈ క్రమంలోనే అందరూ కలిసి ఆదర్శవంతంగా ఉండే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేశారు. కాలనీలో ఎవరికి ఆడపిల్ల పుట్టినా లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలన్న ఆలోచనపై చర్చించారు. అందరికీ ఈ ఆలోచన నచ్చడంతో వచ్చే ఏడాది నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకున్నారు.

300 మంది సభ్యులున్న కమిటీలో ఆడపిల్ల పుట్టిన సమయంలో ఒక్కొక్కరి వంతు 350 రూపాయల చొప్పున వేసుకొని లక్ష రూపాయలను సేకరించాలనుకున్నారు. ఈ మొత్తం లక్ష రూపాయలు అవుతుంది. ఈ లక్ష రూపాయలను ఆడపిల్ల పేరు మీద డిపాజిట్ చేస్తారు. 21ఏళ్లు వచ్చిన ఆతర్వాత ఆ మొత్తం 16 లక్షల రూపాయలు అవుతుంది. ఆ సమయంలో ఆడపిల్ల చదవుకి, పెళ్లికి ఆ మొత్తం ఉపయోగపడుతుందన్న భావన కమిటీ వ్యక్తం చేసింది. దీంతో మునగపాటి వెంకటేశ్వరావు ఆలోచనకు అందరూ సహకరిస్తామని చెప్పి తీర్మానం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

ఇవి కూడా చదవండి

2024 జనవరి ఒకటో తేది నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ఆ రోజు నుండి కాలనీలో పుట్టిన ఆడపిల్ల పేరు మీదుగా లక్ష రూపాయలు డిపాజిట్ చేయనున్నారు. ఇందిరా నగర్ కాలనీ వాసులు నిర్ణయం ఆదర్శవంతమైన నిర్ణయమని పలువురు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..