AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. ఇదేం పని రా.. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులా..?

ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో వీడియో కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఇదే విధంగా చేస్తున్నాడని తెలిపింది. అంతేకాకుండా డ్యూటీ వేసే అంశంలో ఇష్టమొచ్చినట్లు షిఫ్టులు మారుస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. అధికారి వినిపించుకోకపోవడంతో తన వెంట తెచ్చుకున్న ఆలౌట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఛీ.. ఛీ.. ఇదేం పని రా.. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులా..?
Mangalagiri Aiims Hospital
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 22, 2026 | 12:48 PM

Share

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన లక్ష్మీ తిరుపతమ్మ ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఎక్స్ సర్వీస్ మెన్‌గా ఉన్న భర్త చనిపోవడంతోనే ఆమెకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అవకాశం కల్పించారు. ఉద్యోగం రావడంతో మంగళగిరి మండలం యర్రపాలెంకు నివాసం మార్చుకుని పిల్లలతో కలిసి అక్కడే జీవిస్తోంది. అయితే గత కొంతకాలంగా చీఫ్ సెక్యూరిటీ అధికారిగా మోహనాచారి ఆమెపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగివేసాగిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో వీడియో కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఇదే విధంగా చేస్తున్నాడని తెలిపింది. అంతేకాకుండా డ్యూటీ వేసే అంశంలో ఇష్టమొచ్చినట్లు షిఫ్టులు మారుస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. అయితే వేధింపులకు గురి చేయవద్దని పిల్లలున్నారని వేడుకున్నా మోహనాచారి కనికరించలేదని తెలిపింది. పైగా షిఫ్టులకు సరిగా హాజరు కావడం లేదంటూ ఆమెను ఉద్యోగంలో నుండి తొలగిస్తున్నట్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ తిరుపతమ్మ మూడు రోజుల క్రితం సెక్యూరిటీ అధికారి కార్యాలయానికి వెళ్లి ఉద్యోగం ఇవ్వాలంటూ వేడుకుంది. అధికారి వినిపించుకోకపోవడంతో తన వెంట తెచ్చుకున్న ఆలౌట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ఎయిమ్స్ లో చేర్పించారు. అయితే కేసు నమోదు చేయాల్సి ఉండగా వద్దంటూ మోహనాచారి అడ్డుకున్నాడు. అయితే ఆమెకు ట్రీట్ మెంట్ చేస్తున్న వైద్యుడు వెంటనే ఎమ్మెల్సీగా నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అప్పటి నుండి తోటి ఉద్యోగులను పంపి ఆమెను మరోసారి బెదిరింపులకు దిగాడు. ఆమెకు సాయం చేస్తున్నారంటూ మరికొంతమందిపై చర్యలు తీసుకునేందుకు మోహనాచారి సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుండి ఢిఛార్జ్ అయిన లక్ష్మీ తిరుపతమ్మ తన తండ్రితో కలిసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన మోహనాచారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీడియో కాల్ చేసిన ఆధారాలను బయటపెట్టింది. దీంతో మోహనాచారిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక ఆరోపణలు రావడమే కాకుండా మహిళ కేసు నమోదు చేయకుండా అడ్డుపడిన అధికారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు