AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అత్తారింటికి వెళ్లడానికి లేటవుతుందని.. ఆర్టీసీ బస్సు వేసుకెళ్లాడు..

అత్తారింటికి వెళ్దామనుకున్న అతనికి.. సమయానికి బస్సు రాకపోవడంతో చిర్రెత్తుకొచ్చింది. దీంతో కనిపించిన ఆర్టీసీ బస్సు వేసుకుని.. అత్తగారి ఊరు వెళ్లిపోయాడు.. తన అవసరం తీరాక ఆ బస్సును నేరుగా పోలీసులకే అప్పగించాడు.

AP News: అత్తారింటికి వెళ్లడానికి లేటవుతుందని.. ఆర్టీసీ బస్సు వేసుకెళ్లాడు..
Bus
Ram Naramaneni
|

Updated on: Jul 27, 2024 | 3:03 PM

Share

ఏంటి అన్న.. మరి ఇలా ఉన్నావ్.. నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి ప్రవర్తన.. పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను అత్తారింటికి వెళ్లడానికి బస్సు కోసం ఎదురుచూశాడు. ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో.. దగ్గర్లో పార్క్ చేసిన ఉన్న ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి… ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు.. ముచ్చుమర్రి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చాడు. ఎంత ఎదురుచూసినా బస్సు రాకపోవడంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. దగ్గర్లోని పెట్రోల్ బంక్ దగ్గర RTC బస్సు కనిపించడంతో దాని దగ్గరకు వచ్చాడు. బస్సులో ఎవరూ లేరు.. తాళం కూడా ఉండటంతో.. వెంటనే ఆ బస్సు ఎక్కి తోలుకుంటూ అత్తగారి ఊరు వెళ్లిపోయాడు.

ముచ్చుమర్రి వెళ్లిన తర్వాత బస్సును తీసుకెళ్లి.. లోకల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. బస్సు ఎందుకు తీసుకొచ్చావ్ అని పోలీసులు ప్రశ్నించగా… ఎంత సేపు ఎదురుచూసినా బస్సు రాకపోవడంతో.. ఈ బస్సును వేసుకుని వచ్చానని అతను చెప్పడంతో.. పోలీసులు అవాక్కయ్యారు. దీంతో పోలీసులకు కాసేపు ఏం చేయాలో పాలుపోలేదు. దుర్గయ్యను కాసేపు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి.. ఆ బస్సును మళ్లీ ఆత్మకూరుకు పంపించారు. బస్సు ప్రయాణం చేసేందుకు డబ్బులు లేకపోవడంతోనే.. అతను ఇలా చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బస్సు పోయిందని ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో.. దుర్గయ్యపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..