AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్న తండ్రి కాకపోయినా కంటికి రెప్పలా కాపాడుతాడని నమ్మింది ఆ చిన్నారి.. చివరకి!

కన్న తండ్రి కాకపోయినా కంటికి రెప్పలా కాపాడుతాడని నమ్మింది ఆ తల్లి.! ఆ తల్లి నమ్మకం నిజమేనేమో రక్తం పంచుకుని కనకపోయినా మారు తండ్రి కన్న బిడ్డల చూసుకుంటాడని నమ్మింది ఓ చిన్నారి.! అయితే ఈ ఇద్దరి నమ్మకాన్ని వమ్ము చేశాడు ఆ కామాంధుడు..ఆతల్లీకూతుళ్ల నమ్మకాన్ని ఒమ్ము చేయడంతో పాటు మారు తండ్రి అనే పదానికి కళంకం తెచ్చాడు.

కన్న తండ్రి కాకపోయినా కంటికి రెప్పలా కాపాడుతాడని నమ్మింది ఆ చిన్నారి.. చివరకి!
Court
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 31, 2025 | 8:14 PM

Share

కన్న తండ్రి కాకపోయినా కంటికి రెప్పలా కాపాడుతాడని నమ్మింది ఆ తల్లి.! ఆ తల్లి నమ్మకం నిజమేనేమో రక్తం పంచుకుని కనకపోయినా మారు తండ్రి కన్న బిడ్డల చూసుకుంటాడని నమ్మింది ఓ చిన్నారి.! అయితే ఈ ఇద్దరి నమ్మకాన్ని వమ్ము చేశాడు ఆ కామాంధుడు.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురు లాంటి చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడి, ఆతల్లీకూతుళ్ల నమ్మకాన్ని ఒమ్ము చేయడంతో పాటు మారు తండ్రి అనే పదానికి కళంకం తెచ్చాడు ఓ దుర్మార్గుడు. అయితే కన్న కూతురిపై తాను నమ్మిన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుసుకున్న తల్లి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కింది. కట్ చేస్తే మూడేళ్ల తర్వాత ఆ కామాంధుడికి కోర్టు సరైన శిక్ష విధించి, న్యాయం ఇంకా బతికే ఉందని రుజువు చేసింది. ఇంతకీ ఆ తల్లి ఎవరు ఈ సంఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందాం..!

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందిన ఓ మహిళ కు భర్త చనిపోవడంతో అంజయ్య అనే వ్యక్తిని నమ్మింది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడతానని ఇద్దరినీ బాగా చూసుకుంటానని అంజయ్య చెప్పడంతో నమ్మి సహ జీవనం చేసింది. పెళ్లి చేసుకుంటానని కొద్ది సమయం కావాలంటూ అడగడంతో వేచిచూసింది. ఓవైపు తల్లితో కాపురం చేస్తూనే కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆమె కూతురుపై కన్నేశాడు దుర్మార్గుడు అంజయ్య..

మహిళ ఇంట్లో లేని సమయంలో పలుమార్లు ఆ బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బయట చెప్తే తల్లితోపాటు కూతురుని కూడా చంపేస్తానని బెదిరించడంతో, ఆ బాధను మనసులోనే దాచుకుంది ఆ చిన్నారి. అయితే కాలం గడిచే కొద్దీ ఆ కామాంధుడు అంజయ్య మరింత క్రూరంగా మారడంతో చివరికి జరిగిన సంఘటన గురించి తల్లికి చెప్పింది. దీంతో బిడ్డలా చూసుకుంటానని చెప్పిన వ్యక్తి నమ్మకద్రోహం చేయడంతో తట్టుకోలేని తల్లి వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో 2022 జూలై 1న తన కూతురికి జరిగిన దారుణాన్ని కంప్లైంట్ రూపంలో ఇచ్చింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం తరలించి అంజయ్య పై కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి చిన్నారికి జరిగిన ఘటనపై సాక్ష్యాధారాలతో సహా రుజువు కావడంతో శుక్రవారం (అక్టోబర్ 31) అంజయ్యకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రు.40,000 జరిమానా విధించింది. సాక్షాదారాలను సేకరించి అంజయ్యకు శిక్షపడేలా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ పలువురు అభినందించారు. అలాగే బాలికకు జరిగిన అన్యాయాన్ని విచారించిన న్యాయమూర్తి సింపిరెడ్డి సుమ నిందితుడికి శిక్ష వేసి న్యాయం బతికే ఉందని మరోసారి నిరూపించింది అని బాలిక తల్లి ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..