Andhra Pradesh: మరొకరిని బలి తీసుకున్న లోన్‌యాప్‌.. న్యూడ్‌ ఫొటోలను షేర్ చేయడంతో యువకుడి సూసైడ్‌

కుటుంబంతో కలిసి పండుగకు వస్తాడనుకున్న కొడుకు శవంగా మారడంతో ఆ తల్లిదండ్రులను కలచివేసింది. ఎంబీఏ చదివిన బిడ్డ అమాయకంగా రుణయాప్ కు బలవుతాడని ఆ కుటుంబం అస్సలు ఊహించలేదు. దీంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

Andhra Pradesh: మరొకరిని బలి తీసుకున్న లోన్‌యాప్‌.. న్యూడ్‌ ఫొటోలను షేర్ చేయడంతో యువకుడి సూసైడ్‌
Loan App Harassment

Edited By: Ravi Kiran

Updated on: Oct 06, 2022 | 11:02 AM

నిన్న నేడు రేపు.. రోజులు గడుస్తూనే ఉన్నాయ్. తరచూ ఏదో ఒక ఘటన. మొన్న రాజమండ్రి.. నిన్న ధవళేశ్వరం.. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో మరో లోన్ యాప్ మరణం. ఈ లోన్ యాప్ యమకింకరుల ఆగడాలకు అంతు లేదా? వీరిని ఇలాగే వదిలేస్తారా? ప్రభుత్వాలు పట్టించుకోవా? అని బాధితు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో ప్రాణం బలైంది. కుటుంబంతో కలిసి పండుగకు వస్తాడనుకున్న కొడుకు శవంగా మారడంతో ఆ తల్లిదండ్రులను కలచివేసింది. ఎంబీఏ చదివిన బిడ్డ అమాయకంగా రుణయాప్ కు బలవుతాడని ఆ కుటుంబం అస్సలు ఊహించలేదు. దీంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.. నా బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఎవరికీ జరగకూడదు అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు..

వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరుకు చెందిన రాజేష్ ఎంబీఏ పూర్తి చేశాడు. పెళ్లి తర్వాత రాజేష్ హైదరాబాద్ లోని.. ఓ ప్రయివేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతని భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. కుటుంబ అవసరాల కోసం.. XP క్యాష్ అనే రుణయాప్ నుంచి లోన్ తీసుకొని తిరిగి చెల్లించాడు రాజేష్. అయినా సరే లోన్ యాప్ కంపెనీ వేధింపులు ఆగలేదు. అతని న్యూడ్ ఫొటోలను సైతం కుటుంబ సభ్యులకు పంపించడంతో మనస్థాపానికి గురైన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ కూడా రాశాడు రాజేష్. సీఎం కేసీఆర్ సార్.. ప్రధాని మోడీ గారు లోన్ యాప్ నిర్వాహకులలపై కఠిన చర్యలు తీసుకోవాలని..తనలా మరెవరు బలి కాకూడదు అంటూ సూసైడ్ నోట్లో అభ్యర్ధించాడు రాజేష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..