
YSRCP vs Janasena: నన్నెవరు అడ్డుకుంటారో చూస్తా అని ఒకరంటారు.. నిన్ను అడ్డుకోవాల్సిన అవసరం మాకేంటని ఇంకొకరంటారు.. మీ వెనుక ఉన్నది రౌడీలంటూ ఆయన అంటారు,.. ఎవరి వెనుక ఎవరున్నారో రికార్డులున్నాయంటూ ఇంకొకరంటారు.. ఇలా ఏపీ రాజకీయాల్లో మాటల దాడి, ప్రతిదాడి జోరందుకుంది.. ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటినుంచే ఎత్తుకు పై ఎత్తు వేస్తూ.. వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం వారాహి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్.. వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై వైసీపీ నేత మల్లాది విష్ణు స్పందించారు. పవన్‌కల్యాణ్‌కు స్థిరత్వం లేదని, ఏమీ లేనివాడు ప్రభుత్వం స్థాపిస్తాననడం విడ్డూరంగా ఉందంటూ పేర్కొన్నారు. వారాహి యాత్రకు జనమే లేరు, ఆ ఫ్రస్టేషన్‌లో పవన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారంటూ విమర్శించారు. అసెంబ్లీకి పంపాలని దిగజారిపోయి ప్రజలను ప్రాధేయపడ్డారన్నారు. ఎవరివెనుక రౌడీలున్నారో రికార్డు చూస్తే తెలుస్తుందంటూ మల్లాది విష్ణు పేర్కొన్నారు.
రాజకీయాల్లో నిలబడాలంటే స్థిరత్వం అవసరమని, అది పవన్‌కల్యాణ్‌లో లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఎవరు ఏం చేస్తారనే విషయం ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజలు ఓటు వేయలేదు కాబట్టి పవన్ కల్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయారని తెలిపారు. అనవసరంగా సీఎం జగన్‌పై ఆరోపణలు చేయడం తగదని కారుమూరి అన్నారు.
సీఎం జగన్‌పై అర్థరహిత విమర్శలు చేయడం పవన్ కల్యాణ్‌కు అలవాటుగా మారిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాజకీయాలు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని అంబటి రాంబాబు అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..