AP Rains: ఓర్నీ.! ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు

|

Nov 09, 2024 | 6:29 PM

ఏపీలో వర్షాలు పడతాయా..? తాజాగా అమరావతి వాతావరణ కేంద్రం వాతావరణ సూచనలు ఏమి ఇచ్చింది.. ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ స్టోరీ చదివేయండి..

AP Rains: ఓర్నీ.! ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు
Andhra Weather
Follow us on

నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు అనగా నవంబర్ 9వ తేదీ ఉదయం 0830 గంటలకు సగటు సముద్ర మట్టానికి 3.6 కి. మీ ఎత్తు వరకు విస్తరించి అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులలో ఇది దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు నెమ్మదిగా కదులుతుంది. నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పై ఉపరితల ఆవర్తనం నుంచి ఉన్న ద్రోణి మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతుంది.

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ:-
——————————————————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..