Andhra Pradesh: వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..

| Edited By: Surya Kala

Nov 23, 2024 | 7:51 PM

మరికొద్దిసేపట్లో తెల్లవారుతుందనగా నడిరోడ్డుపై ఘోరం జరిగిపోయింది. నిద్రమత్తులో ఉన్నాడో, లేక అదుపుతప్పిందో విద్యుత్‌ కేబుళ్ళతో వేగంగా వెళుతున్న లారీ ఒక్కసారిగా జాతీయ రహదారిపై బోల్తా కోట్టింది.

Andhra Pradesh: వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
Fire Accident
Follow us on

వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో రోడ్డుపై కొద్ది దూరంగా ఈడ్చుకుంటూ వెళ్ళింది. లారీలో ఉన్న కేబుల్ బండిల్స్‌ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి… ఇంకా నయం లారీకి వెనుక వస్తున్న వాహనాలు దూరంగా ఉండటంతో రోడ్డుపై పడ్డ భారీ కేబుల్‌ బండిల్స్‌ వల్ల వాహనాలకు ఎలాంటి ముప్పు కలగలేదు. ఈ ప్రమాదంలో నిప్పురవ్వలు ఎగసిపడి లారీ మంటల్లో చిక్కుకుంది. జాతీయ రహదారిపై లారీ వెనుక వస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎదురుగా లారీ బోల్తా పడటం, లారీ మంటల్లో చిక్కుకుపోవడం క్షణాల్లో జరిగిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సాయంతో మంటల్లో కాలిపోతున్న లారీపై నీళ్ళు చల్లి మంటలను అదుపు చేశారు. ఈ ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో అదుపుతప్పి భారీ లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో నడిరోడ్డుపై కేబుల్ వైర్ల లోడుతో వెళుతున్న లారీలో మంటలు వ్యాపించాయి. రోడ్డుపై కేబుల్ వైర్ల బండిల్స్ చెల్లాచెదురుగా పడిపోయాయి. కేబుల్‌ బండిళ్ళ లోడుతో లారీ కలకత్తా నుండి కొట్టాయం వెళుతుండా మార్గమధ్యంలో ప్రకాశంజిల్లా వల్లూరు దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బోల్తా పడిన ఘటనలో స్వల్ప గాయాలతో డ్రైవర్‌, క్లీనర్‌ బయటపడ్డారు. నడిరోడ్డుపై మంటల్లో కాలిపోతున్న లారీని ఫైర్ సిబ్బంది సాయంతో పోలీసులు మంటలను అదుపు చేశారు. నడిరోడ్డుపై లారీ తగలబడటంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..