Andhra Pradesh: సాధువులపై దాడికి యత్నం.. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాగా అనుమానం.. కట్ చేస్తే..
వాళ్లంతా సాధువులు, కాషాయ వస్త్రాలు ధరించే ఉన్నారు. కానీ స్థానికులకు అనుమానం వచ్చింది. వాళ్ల వేష ధారణ కొంచెం డిఫరెంట్‌గా ఉండటం, భాష అర్ధం కాకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. వారి నుంచి..
వాళ్లంతా సాధువులు, కాషాయ వస్త్రాలు ధరించే ఉన్నారు. కానీ స్థానికులకు అనుమానం వచ్చింది. వాళ్ల వేష ధారణ కొంచెం డిఫరెంట్‌గా ఉండటం, భాష అర్ధం కాకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. వారి నుంచి తమకు హాని జరుగుతుందన్న ఆందోళనతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సాధువులు వెళ్తూ వెళ్తూ ఆకివీడులో ఆగారు. శివాలయం దగ్గర సేద తీరేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్లపై స్థానికులకు అనుమానం వచ్చింది. కాషాయ వస్త్రాలే ధరించి ఉన్నా సందేహించారు. అఘోరాల మాదిరిగా ముఖం మొత్తం తెల్లని విభూది పూసుకుని ఉండటంతో డౌట్స్ మరింత పెరిగాయి. వాళ్లు చెప్పేది కూడా అర్ధంకాకపోవడంతో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాగా భావించి దాడికి యత్నించారు. అయితే, వాళ్లు ఎదురు తిరగకపోవడంతో శివాలయంలోనే బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు గ్రామస్తులు.
సాధువులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. వివరాలు అడిగి ఆధార్ కార్డులు వెరిఫై చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి దేవాలయాలను సందర్శిస్తూ తిరుమల వెళ్తున్నట్లు చెప్పారు సాధువులు. వాళ్లు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నిజమని తేలడంతో సాధువులను పోలీసులు విడిచిపెట్టారు.
కాగా.. గతంలోనూ మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. సాంగ్లీ జిల్లాలో నలుగురు సాధువులపై స్థానికులు దాడి చేశారు. పండరీపురం క్షేత్రానికి కారులో వెళ్తున్న సాధువులను పిల్లలను ఎత్తుకుపోయిన ముఠాగా అనుమానించి కర్రలతో చావబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. సాధువులను వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తరలించి సమగ్ర విచారణ చేపట్టారు. ఆ తర్వాత వారు నిజమైన సాధువులేనని తేల్చారు. వీరంతా మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందిన సాధువులని గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..