Andhra Pradesh: కిక్కు కోసం పెగ్గుల మీద పెగ్గులు వేస్తున్నారా? అయితే ఇటు ఓ లుక్కేసుకోండి..

|

Dec 09, 2022 | 11:20 AM

Liquor Adulteration: మందు బాబులకు కళ్ల ముందు మందు కనిపిస్తే పండుగే పండుగ. అది ఏం బ్రాండ్, ఏం మందు అనే సంగతే పట్టించుకోకుండా పెగ్గుల పెగ్గులు కుమ్మేస్తుంటారు. అయితే, ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే మాత్రం మందుబాబుల..

Andhra Pradesh: కిక్కు కోసం పెగ్గుల మీద పెగ్గులు వేస్తున్నారా? అయితే ఇటు ఓ లుక్కేసుకోండి..
Liquor Adulteration
Follow us on

మందు బాబులకు కళ్ల ముందు మందు కనిపిస్తే పండుగే పండుగ. అది ఏం బ్రాండ్, ఏం మందు అనే సంగతే పట్టించుకోకుండా పెగ్గుల పెగ్గులు కుమ్మేస్తుంటారు. అయితే, ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే మాత్రం మందుబాబుల గొంతుల్లో మందు బదులు మంచినీరు పోసినట్లే ఉంటుంది. అవును, మందుబాబుల వ్యవసాన్ని ఆసరాగా చేసుకుని మద్యం అమ్మకందారులు దారుణాలకు తెగబడుతున్నారు. మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. డబ్బుపై అత్యాశతో చిల్లర పనులు చేస్తున్నారు. తాజాగా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రభుత్వ మద్యం దుకాణంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మద్యం బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి సగం ముందు తీసేసి నీళ్లతో నింపేస్తున్నారు. ఈ కల్తీని గుర్తించిన స్థానికులు.. నీళ్లతో నింపిన మద్యం బాటిళ్లను అమ్ముతున్నారని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు మద్యం షాపు మూసేసి తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కల్తీ జరిగిన విషయాన్ని గుర్తించిన అధికారులు.. ప్రస్తుత సిబ్బందిని తొలగించి కొత్త వారిని నియమిస్తామని ప్రకటించారు.

కాగా, కాట్రావులపల్లిలోనే కాకుండా చాలా చోట్ల ఇలాగే జరుగుతుందని, అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మద్యం కల్తీ చేయడం, తెలియని బ్రాండ్లను అమ్మడం వంటివి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..