Medical posts: ఏపీలో ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే..

ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఆరోగ్య మిత్ర పోస్టులను తీసుకోనున్నారు. ఇందుకు గాను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ దరఖాస్తులను..

Medical posts: ఏపీలో ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే..
AP Govt
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 09, 2022 | 10:05 AM

ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఆరోగ్య మిత్ర పోస్టులను తీసుకోనున్నారు. ఇందుకు గాను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ/ ఎంఎస్సీ(నర్సింగ్‌) లేదా బీఫార్మసీ/ డీఫార్మసీ లేదా బీఎస్సీ(ఎంఎల్‌టీ)ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 65 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆఫీస్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్ విద్యార్హత, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 14-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..