APOSS Admissions 2022-23: ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో టెన్త్, ఇంటర్‌ ప్రవేశాలు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు..

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు..

APOSS Admissions 2022-23: ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో టెన్త్, ఇంటర్‌ ప్రవేశాలు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు..
APOSS SSC Inter Admission 2022-23
Follow us

|

Updated on: Dec 09, 2022 | 2:53 PM

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు తాత్కాలిక పద్ధతిలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు మచిలీపట్నం జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో ప్రవేశాలకు రూ.300, ఇంటర్మీడియట్‌కు రూ.400 చొప్పున అపరాధ రుసుము చెల్లించి డిసెంబ‌రు 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు.

అడ్మిషన్‌ ఫీజు డిసెంబర్‌ 13వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన అన్నారు. పదో తరగతికి అడ్మిషన్‌ ఫీజు జనరల్‌ కేటగిరికి రూ.1300లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీస్‌/ఎక్స్‌సర్వీస్‌మెన్/వికలాంగులు/మహిళలకు రూ.900లు ఉంటుంది. ఇంటర్మీడియట్‌ అభ్యర్ధులకు జనరల్‌ కేటగిరికి రూ.1400లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీస్‌/ఎక్స్‌సర్వీస్‌మెన్/వికలాంగులు/మహిళలకు రూ.1100లు ప్రవేశ రుసుము చెల్లించవల్సి ఉంటుంది. వివరాలకు 8008403506 మొబైల్‌ నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చన్నారు.

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.