AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: వర్షాలు దంచుడే దంచుడు.. ఏపీలో వచ్చే 3 రోజులు ఆ ప్రాంతాల్లో వానలే వానలు

నిన్నటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు తక్కువగా గుర్తించబడినది. అయితే దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. పశ్చిమ రాజస్థాన్ నుండి ఉత్తర విదర్భ వరకు ఉన్న ద్రోణి..

AP Rains: వర్షాలు దంచుడే దంచుడు.. ఏపీలో వచ్చే 3 రోజులు ఆ ప్రాంతాల్లో వానలే వానలు
Weather
Ravi Kiran
|

Updated on: Apr 11, 2025 | 1:53 PM

Share

నిన్నటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు తక్కువగా గుర్తించబడినది. అయితే దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. పశ్చిమ రాజస్థాన్ నుండి ఉత్తర విదర్భ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు పశ్చిమ రాజస్థాన్ నుండి తూర్పు రాజస్థాన్ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు కొనసాగుతోంది.

ఉపరితల ఆవర్తనం వాయువ్య మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. ఎగువ ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం & పొరుగు ప్రాంతాల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–

ఈరోజు, రేపు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది

రాయలసీమ:- ——————-

ఈరోజు, రేపు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గమనిక:- కోస్తా ఆంద్రప్రదేశ్, యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల రెండు రోజుల్లో సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కు వ గ పెరిగే అవకాశముంది, తరువాత గణనీయమైన మార్పులేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమలో రాగల రెండు రోజుల్లో సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కు వ గ పెరిగే అవకాశముంది, తరువాత గణనీయమైన మార్పులేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!