Challa Family Dispute: చల్లా ఫ్యామిలీలో చల్లారని విభేదాలు.. అత్తా, కోడలు మధ్య ఆడపడుచు ఎంట్రీతో మరో మలుపు
చల్లా కుటుంబంలో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు పెద్దకొడుకు, చిన్న కోడలు మధ్య మాత్రమే రాజకీయ వారసత్వ ఫైట్ అనుకుంటే, ఇప్పుడు కథ మొత్తం మరో మలుపు తిరిగింది. అత్తా కోడలు, మధ్యలోకి ఆడపడుచు ఎంట్రీ ఇచ్చింది..

చల్లా ఫ్యామిలీలో చెలరేగిన మంటలు బ్లోఅవుట్‌గా మారాయ్. ఫొటో ఫ్రేమ్ దగ్గర మొదలైన గొడవ చినికిచినికి గాలివానలా మారింది. ఇప్పటివరకు రాజకీయ వారసత్వం ఒక్కటే అనుకుంటే.. ఇప్పుడు పరువూ ప్రతిష్ట అంటూ కొత్త విషయాలు తెరపైకి వచ్చాయ్. అత్తా కోడల ఫైట్‌లోకి ఆడపడుచు ఎంట్రీ ఇవ్వడంతో కథ ఇంకో మలుపు తిరిగింది. ఇంతకీ, చల్లా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది?. గొడవ వెనకున్న అసలు సీక్రెట్ ఏంటి? చల్లా కుటుంబంలో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు పెద్దకొడుకు, చిన్న కోడలు మధ్య మాత్రమే రాజకీయ వారసత్వ ఫైట్ అనుకుంటే, ఇప్పుడు కథ మొత్తం మరో మలుపు తిరిగింది. అత్తా కోడలు, మధ్యలోకి ఆడపడుచు ఎంట్రీ ఇచ్చింది. మొత్తం గొడవకు ఫొటో ఫ్రేమ్ ఒక సాకు మాత్రమే, అసలు కథ మాత్రం ఇంకేదో ఉందనేలా డైలాగ్‌లు వినిపించారంతా. అసలు, మేము దాడే చేయలేదని అత్త శ్రీదేవి, ఆడపడుచు పృథ్వి అంటుంటే.. ఆస్తుల గొడవను తెరపైకి తెచ్చింది కోడలు శ్రీలక్ష్మి.
కుటుంబ సభ్యులంతా కలిసి తనపై దాడులు చేస్తున్నారని, తన మనుషులను బెదిరిస్తున్నారని అంటోంది శ్రీలక్ష్మి. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన శ్రీలక్ష్మి.. అత్తా ఆడపడుచుపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, అవన్నీ అబద్దాలే అంటున్నారు విఘ్నేశ్వర్‌రెడ్డి. వారసత్వం అంటే కేవలం ఆస్తులే కాదన్నారు విఘ్నేశ్వర్‌రెడ్డి. పరువు, ప్రతిష్ట అన్నీ వస్తాయంటున్నారు. అయినా, చల్లా కుటుంబ రాజకీయ వారసత్వ ఎవరిదో ప్రజలే డిసైడ్ చేస్తారని, కానీ శ్రీలక్ష్మికి ఎందుకంత ఉలికిపాటు అంటూ నవ్వుతూనే మాటల తూటాలు పేల్చారు విఘ్నేశ్వర్‌రెడ్డి. అలాగైతే తనపై ఎందుకు దాడులు చేస్తున్నారంటూ టీవీ9 వేదికగా విఘ్నేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు శ్రీలక్ష్మి. ఒకవైపు రాజకీయ వారసత్వం, ఇంకోవైపు ఆస్తులు పంచాయితీ, మొత్తంగా చల్లా కుటుంబంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ప్రస్తుతం రోడ్డునపడ్డ చల్లా ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు… ముందుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో మరి!




మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..