టోల్‌గేట్ వద్ద షాకింగ్‌ ఘటన.. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో చెలరేగిన మంటలు…

|

Jan 14, 2025 | 12:20 PM

బస్సు రన్నింగ్ లో ఉండగా టైర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో రాపిడికి మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో పాక్షికంగా ట్రావెల్స్ బస్సు కాలిపోగా.. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి బయటపడిన ప్రయాణికులు వారి ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు నంద్యాల శివారు చాపిరేవుల టోల్ గేట్ వద్ద రాగానే ఈ ఘటన జరిగింది..

టోల్‌గేట్ వద్ద షాకింగ్‌ ఘటన.. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో చెలరేగిన మంటలు…
Private Travels Bus Caught
Follow us on

దర్శనానికి వెళ్లి వస్తున్నభక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు టైర్‌ పేలి.. ఆ వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి..ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల టోల్‌గేట్ వద్ద ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బస్సు రన్నింగ్ లో ఉండగా టైర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో రాపిడికి మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో పాక్షికంగా ట్రావెల్స్ బస్సు కాలిపోగా.. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి బయటపడిన ప్రయాణికులు వారి ప్రాణాలు కాపాడుకున్నారు.

బస్సు నంద్యాల శివారు చాపిరేవుల టోల్ గేట్ వద్ద రాగానే ఈ ఘటన జరిగింది.. బస్సు.. తిరువనంతపురం నుండి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.. బస్సు టైర్‌ నుండి మంటలు, వాసన వస్తుందని గమనించిన టోల్‌ గేట్‌ సిబ్బంది.. డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు.. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దింపాడు. దీంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..