Maha Kumbabishekam: శ్రీశైలంలో ఐదో రోజు మహా కుంభాభిషేకం పూజలు.. వేదమంత్రాల నడుమ..

ఉదయం శాస్త్రబద్ధంగా పూజల క్రతువులు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభాభిషేక పూజాది కార్యక్రమాలను పురస్కరించుకొని స్వామి అమ్మ వార్లకు ప్రతిరోజు విశేష పూజలు, దేవత హవములు, దేవా హవాములు, జపాలు, పారాయణం నిర్వహిస్తున్నారు.

Maha Kumbabishekam: శ్రీశైలంలో ఐదో రోజు మహా కుంభాభిషేకం పూజలు.. వేదమంత్రాల నడుమ..
Srishailam Hundi

Edited By: Jyothi Gadda

Updated on: Feb 20, 2024 | 8:01 PM

Maha Kumbabishekam: శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంలో మహా కుంభాభిషేకం వేడుకలను దేవస్థానం వైభవంగా నిర్వహిస్తుంది. లోక కళ్యాణం, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన మహా కుంభాభిషేక మహోత్సవ క్రతువులు ఐదవ రోజుకు చేరుకుంది. ఉదయం శాస్త్రబద్ధంగా పూజల క్రతువులు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభాభిషేక పూజాది కార్యక్రమాలను పురస్కరించుకొని స్వామి అమ్మ వార్లకు ప్రతిరోజు విశేష పూజలు, దేవత హవములు, దేవా హవాములు, జపాలు, పారాయణం నిర్వహిస్తున్నారు.

ఫిబ్రవరి 21న మహా కుంభాభిషేకం చివరి రోజు.. ఆఖరు పూజా మహోత్సవంలో కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధ రామ పండితారాధ్య శివచార్య మహా స్వామీజీ, పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతి తో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్ననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..