Kartika Deepotsavam: డిసెంబర్‌ 11న విశాఖలో కార్తీకదీపోత్సవం.. టీటీడీ ముమ్మర ఏర్పాట్లు

| Edited By: Srilakshmi C

Dec 03, 2023 | 6:47 AM

విశాఖలో కార్తిక దీపోత్సవం జరగనుంది. ఈ మేరకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కార్తీక మాసంలో డిసెంబర్ 11న వైజాగ్‌లో దాతల సహకారంతో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. టీటీడీ జెఈవో సదా భార్గవి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్ష నిర్వహించిన జేఈఓ సదా భార్గవి దిశా నిర్దేశం చేశారు. కార్తీకదీపోత్సవంలో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక..

Kartika Deepotsavam: డిసెంబర్‌ 11న విశాఖలో కార్తీకదీపోత్సవం.. టీటీడీ ముమ్మర ఏర్పాట్లు
TTD JEO Sada Bhargavi review on Kartika Deepotsavam
Follow us on

విశాఖపట్నం, డిసెంబర్ 3: విశాఖలో కార్తిక దీపోత్సవం జరగనుంది. ఈ మేరకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కార్తీక మాసంలో డిసెంబర్ 11న వైజాగ్‌లో దాతల సహకారంతో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. టీటీడీ జెఈవో సదా భార్గవి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్ష నిర్వహించిన జేఈఓ సదా భార్గవి దిశా నిర్దేశం చేశారు. కార్తీకదీపోత్సవంలో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇందుకు అవసరమైన రికార్డింగ్ పనుల కోసం ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ సహకారం తీసుకోవాలన్నారు. అవసరమైన విభాగాల నుండి ముందస్తుగా డిప్యుటేషన్ పై సిబ్బందిని విశాఖకు పంపాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు ముందుగా వెళ్లి వేదిక, క్యూలైన్లు తదితర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చేపట్టాలన్నారు. ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఈఓ సదా భార్గవి అన్నారు.

స్థానిక పోలీసుల సహకారంతో తగిన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తగినంతమంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని, మీడియాతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కోసం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేదపఠనం కోసం తిరుమల ధర్మగిరి వేద పాఠశాలతో పాటు ఎస్వీ వేద వర్సిటీ నుంచి వేదపండితులను ఆహ్వానించాలన్నారు. కార్తీకదీపోత్సవం నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న దాతలతో వర్చువల్ సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. వేదిక ను త్వరితగతిన ఖరారు చేయాలని దాతలను కోరారు జేఈవో సదాభార్గవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.