Andhra Pradesh: సింపతీ కోసమే ప్రాణహాని అంటున్నారు.. పవన్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్

|

Jun 18, 2023 | 12:54 PM

కాకినాడ ఎమ్మెల్యే రౌడీయిజం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన కామెంట్లపై స్పందించారు ద్వారంపూడి చంద్రశేఖర్‌. ఆషామాషీగా అన్న పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని.. గొడవలు, కొట్లాటలు ఎన్నో చూశానంటూ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ సింపతీ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌.

Andhra Pradesh: సింపతీ కోసమే ప్రాణహాని అంటున్నారు.. పవన్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్
Dwarampudi, Pawan
Follow us on

కాకినాడ ఎమ్మెల్యే రౌడీయిజం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన కామెంట్లపై స్పందించారు ద్వారంపూడి చంద్రశేఖర్‌. ఆషామాషీగా అన్న పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని.. గొడవలు, కొట్లాటలు ఎన్నో చూశానంటూ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ సింపతీ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌. టీవీ9 తో మాట్లాడిన ద్వారం పూడి ‘పవన్‌ మీటింగ్‌లకు జనాలే రావడం లేదు. అందుకే సానుభూతి పొందాలని పవన్‌ చూస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌పై నాకు ఎలాంటి కక్ష లేదు. ఎవరేం మాట్లాడినా నా దగ్గర సమాధానం ఉంది. అన్నిటికీ సోమవారం (జూన్‌ 19) సమాధానం చెబుతా. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోను. ఏ విషయంలోనూ కూడా తగ్గేది లేది.బీసీలకు ఏం చేశామో త్వరలో కాకినాడలో సభ ఏర్పాటు చేసి చెబుతాను. పవన్‌ ప్రశ్నలకు, విమర్శలన్నింటికీ సోమవారం (జూన్‌ 19) సమాధానం చెబుతా’ అని ద్వారంపూడి పేర్కొన్నారు.

కాగా ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌ ద్వారంపూడిపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే రౌడియిజం చేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన కామెంట్లు చేశారు. తనను చంపేందుకు సుపారీ గ్యాంగులను రంగంలోకి దించారన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..