Andhra Pradesh: నిండు సభలో కంట తడి పెట్టుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..?

ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అపురూపమైన దశ అని, దాన్ని మధురమైన ఘట్టంగా నిలిపేందుకు పిల్లలకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కలు కల్పించిందన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్.

Andhra Pradesh: నిండు సభలో కంట తడి పెట్టుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..?
Kakinada District Collector Shanmohan Nagili
Follow us
Pvv Satyanarayana

| Edited By: Balaraju Goud

Updated on: Nov 20, 2024 | 9:21 PM

చిన్నారుల పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు చేపడతామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి హెచ్చరించారు. స్థానిక అంబేద్కర్ భవన్ స్టేడియంలో ఐసిడిఎస్, విద్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిధిగా, అసిస్టెంట్ హాజరై వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అపురూపమైన దశ అని, దాన్ని మధురమైన ఘట్టంగా నిలిపేందుకు పిల్లలకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కలు కల్పించిందన్నారు. వారి రక్షణ కొరకు ఫోక్సో వంటి కఠినమైన చట్టాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. అయినప్పటికీ చిన్నారుల పట్ల లైంగిక అకృత్యాలు, హక్కుల హననం కొనసాగడం దురదృష్టకరమని జిల్లా కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లలపై దురాగతాలను అరికట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలలు, బాలికలపై జరుగుతున్న అమానుష సంఘటనల పట్ల ఆవేదనతో కంటతడి పెట్టి కొద్ది సేపు భావోద్వేగానికి లోనయ్యారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. చైల్డ్ సేఫ్ జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దే లక్ష్యంగా జిల్లాలో 6 నెలల పాటు ఉద్యమ కార్యాచరణను అమలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

వీడియో చూడండి..

చైల్డ్ అబ్యూజ్ నివారణకు గుడ్-బ్యాడ్ టచ్ గురించి, బాలబాలికల్లోను, పిల్లల హక్కులు, రక్షణ, పోక్సో చట్టం పట్ల పెద్దలలోను విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. పిల్లల పట్ల ఎవరైనా అనుచితంగాను వ్యవహిస్తే పోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు గైకొంటామని ఆయన స్పష్టం చేశారు. తమ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే బాలలు 1098, 112 హెల్ప్ లైన్లకు ఫోన్ చేయవచ్చునని, 7331126044 నెంబరుకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసి తక్షణ సహాయం పొందవచ్చునన్నారు. అలాగే 112 కంట్రోల్ రూమ్ నెంబరుకు సభకు హాజరైన వారందరి ద్వారా ఫోన్ చేయించి, అత్యవసర రక్షణ పోలీస్ శాఖ ద్వారా ఎలా పొందవచ్చో లైవ్ డెమో ద్వారా కలెక్టర్ వివరించారు. అలాగే, బాలల హక్కుల దినోత్సవం పురస్కరించి జిల్లాలో వివిధ అంశాలలో ప్రతిభను చాటిన విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ ప్రశంసా పురస్కారాలను అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రజనీకాంత్ రోబోను ఆ స్టార్ హీరో చేయాల్సిందా! ఆ ఒక్క కారణంతో..
రజనీకాంత్ రోబోను ఆ స్టార్ హీరో చేయాల్సిందా! ఆ ఒక్క కారణంతో..
మాస్‌ జాతర చూపిస్తానంటున్న బన్నీ.! ఇకపై ఫైర్‌ కాదు.. వైల్డ్ ఫైరు!
మాస్‌ జాతర చూపిస్తానంటున్న బన్నీ.! ఇకపై ఫైర్‌ కాదు.. వైల్డ్ ఫైరు!
చలికాలంలో గీజర్‌ వాడుతున్నారా? ఈ తప్పులు చేశారో ప్రాణాలకే ముప్పు
చలికాలంలో గీజర్‌ వాడుతున్నారా? ఈ తప్పులు చేశారో ప్రాణాలకే ముప్పు
రామ్ చరణ్, జాన్వీ మూవీ షూటింగ్ షురూ.. ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే?
రామ్ చరణ్, జాన్వీ మూవీ షూటింగ్ షురూ.. ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే?
వెంట్రుకల చివర్లు చిట్లాయా? ఈ హెయిర్‌ ప్యాక్‌తో చికిత్స చేసేయండి
వెంట్రుకల చివర్లు చిట్లాయా? ఈ హెయిర్‌ ప్యాక్‌తో చికిత్స చేసేయండి
నిండు సభలో కంట తడి పెట్టుకున్న కలెక్టర్‌
నిండు సభలో కంట తడి పెట్టుకున్న కలెక్టర్‌
స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. తెరిచి చూడగా
స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. తెరిచి చూడగా
ఫోటో షూట్ మీద ఫోకస్ పెంచిన బ్యూటీ.! అవకాశాలు లేకనేనా.?
ఫోటో షూట్ మీద ఫోకస్ పెంచిన బ్యూటీ.! అవకాశాలు లేకనేనా.?
పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?
పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?
సీజన్‌ మారినప్పుడల్లా మాటిమాటికీ జలుబు, దగ్గు వేదిస్తుందా?
సీజన్‌ మారినప్పుడల్లా మాటిమాటికీ జలుబు, దగ్గు వేదిస్తుందా?
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!