Andhra: అమ్మబాబోయ్.. ఆ హోటల్‌లో తిని వదిలేసిన చికెన్, మటన్ పీస్‌లు సర్వ్.. నిండా పురుగులే..
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రముఖ హోటల్ అరబిక్ రెస్టారెంట్‌ను మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్ సీజ్ చేశారు. రెస్టారెంట్‌పై గతకొన్ని రోజులుగా పట్టణ ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహించి సీజ్ చేశామని తెలిపారు. అయితే.. తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి..

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రముఖ హోటల్ అరబిక్ రెస్టారెంట్‌ను మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్ సీజ్ చేశారు. రెస్టారెంట్‌పై గతకొన్ని రోజులుగా పట్టణ ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహించి సీజ్ చేశామని తెలిపారు. అంతేకాదు రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. కస్టమర్లు తిని వదిలేసిన మిగిలిన ఆహారాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ..మరో కస్టమర్‌కి సెర్వ్ చేస్తున్నట్టు గుర్తించామని కమిషనర్ తెలిపారు.
హోటల్లోని మసాలాలు, చికెన్, మటన్, చేపలు, నిల్వ ఉంచిన ఫ్రిడ్జ్‌లో పురుగులు ఉన్నట్లు కూడా బయట పడిందన్నారు. ఇలాంటి హోటల్స్ ఎక్కడున్నా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.. అరబిక్ రెస్టారెంట్ పై గత కొన్ని రోజులుగా పట్టణ ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నాయని.. ఈ క్రమంలోనే తనిఖీలు నిర్వహించగా.. సంచలన విషయాలు వెలుగుచూశాయన్నారు.
వీడియో చూడండి..
కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.. ఇలాంటి హోటళ్లు, రెస్టారెంట్లపై ఉక్కుపాదం మోపాలని.. ప్రజల జీవితాలతో ఆడుకునే వారిని వదిలిపెట్టొద్దంటూ ప్రజలు అధికారులను కోరుతున్నారు. అలాగే.. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ.. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
