JR NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన ట్వీట్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో పొలిటికల్ హీట్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. టీడీపీతో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Andhra Pradesh: హెల్త్ వర్శిటీ పేరు మార్పు ఏపీని కుదిపేసింది. ఎన్టీఆర్‌కు బదులుగా వైఎస్‌ఆర్(YSR) పేరు పెట్టడంపై టీడీపీ(TDP) శ్రేణులు నిరసనలకు దిగారు. అటు వైసీపీ మాత్రం ఎన్టీఆర్ పేరెత్తే అర్హత టీడీపీకి లేదంటూ ఎదురుదాడికి దిగింది. పోటాపోటీ డైలాగ్ వార్‌తో రాజకీయం వేడెక్కింది. కాగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశంపై డిప్లమేటిక్‌గా స్పందించారు. NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులని పేర్కొన్నారు. ఒకరు పేరు తీసి ఒకరి పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గిందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా.. NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
“NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెట్టే గౌరవం YSR స్థాయిని పెంచదు. NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022
తాతగారికి అవమానం జరిగిందంటూ ఎన్టీయార్ సీరియస్ అవుతారని భావించినవాళ్లకు ఈవిధంగా షాక్ తగిలినట్టయింది. వైఎస్‌ఆర్‌నీ, ఎన్టీయార్‌ని కలిపి ఒకే విధంగా చూడ్డం ద్వారా ఎన్టీయార్ చాలా ఇంటిలిజెంట్‌గా వ్యవహరించారనే టాక్ కూడా నడుస్తోంది. గతంలో కూడా ఇటువంటి సందర్భాల్లో వివాదాలకు తావివ్వని రీతిలో స్పందించారు ఎన్టీయార్.
ఐతే హెల్త్ వర్శిటీ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశారు సీఎం జగన్. వైద్య రంగంలో తాము విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, ఇలాంటి సందర్భంలో వర్శిటీకి వైఎస్‌ఆర్ పేరు పెట్టడంలో తప్పు లేదన్నారు. తనకు ఎన్టీఆర్ అంటే అభిమానం ఉందన్నారు జగన్. మరోవైపు ఎన్టీఆర్ పేరు మార్పు అత్యంత హేయమైన చర్య అంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పేరు మార్పుపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ ఫ్యామిలీ అసహనం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు..నందమూరి రామకృష్ణ పేరుతో ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..