TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. అసలు నిజం చెప్పిన అధికారులు
Jobs in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. సామాజిక మాధ్యమాల్లో

Jobs in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దంటూ టీటీడీ విజ్ఞప్తి చేసింది. గతంలో కూడా టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారని.. అలాంటి మాటలను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది. టీటీడీలో ఉద్యోగాలంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉదయం నుంచి ప్రకటనలు చేస్తున్నారు. ఉదయం నుంచి ప్రకటనలు వైరల్ కావడంతో అప్రమత్తమైన టీటీడీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉద్యోగాల ప్రకటనలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు టీటీడీ తెలిపింది. కొంతమంది కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని టీటీడీ వర్గాలు తెలిపాయి. టీటీడీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగేటప్పుడు ముందుగా పత్రికల్లో, టీటీడీ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటనలు ఇస్తుంది. ఇలాంటి విషయాలపై టీటీడీ గతంలో కూడా స్పష్టంగా వివరణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అవాస్తవ ప్రకటనలు నమ్మవద్దని టీటీడీ తెలిపింది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేసేవారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ప్రకటనలపై టీటీడీ ఇంటిలిజెన్స్ విభాగం కూడా ఆరా తీస్తోంది.
టీటీడీ ప్రకటన..

Ttd Jobs
Also Read:
Jawad Cyclone: జొవాద్ ఎఫెక్ట్.. విశాఖలో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం.. అధికారుల అలెర్ట్..
Jawad Cyclone Update: ఏపీలోని ఆ ప్రాంతాల్లో మరో మూడురోజులు వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్..
