Shocking: ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు మాత్రమే జరిగే అరుదైన ఘటన.. అది కూడా ఏపీలోనే వెలుగుచూసిన వైనం..

| Edited By: Ram Naramaneni

Nov 18, 2022 | 3:40 PM

సాధారణంగా ఆవులు, గేదెలు ఒక కాన్పులో ఒక పిల్లకు మాత్రమే జన్మనిస్తాయి. అసాధారణ సందర్భాల్లో మాత్రమే రెండు దూడలకు జన్మనిస్తాయి. కానీ, ఇక్కడ అంతకు మించి అని చెప్పాలి.

Shocking: ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు మాత్రమే జరిగే అరుదైన ఘటన.. అది కూడా ఏపీలోనే వెలుగుచూసిన వైనం..
Cow
Follow us on

సాధారణంగా ఆవులు, గేదెలు ఒక కాన్పులో ఒక పిల్లకు మాత్రమే జన్మనిస్తాయి. అసాధారణ సందర్భాల్లో మాత్రమే రెండు దూడలకు జన్మనిస్తాయి. కానీ, ఇక్కడ అంతకు మించి అని చెప్పాలి. ఓ జెర్సీ ఆవు ఒకే కాన్పులో 3 దూడలకు జన్మనిచ్చింది. అలా ఆవును సాకుతున్న రైతు ఇంట పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోనమసీమ జిల్లాలో చోటు చేసుకుంది ఈ అరుదైన ఘటన. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబెడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన రైతు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డికి జెర్సీ ఆవు ఉంది.

ఆ జెర్సీ ఆవుకు ఓకే కాన్పులో నాలుగు దూడలు జన్మించాయి. అంతకు ముందు అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలలో 9 నెలల క్రితం పశు వైద్యుడు భాను ప్రసాద్.. జెర్సీ ఆవుకు ఇంజెక్షన్ ఇచ్చారు. 9 నెలల అనంతరం ఆ ఆవు రెండు గిత్త దూడలు (మగ), రెండు పెయ్యి దూడలు(ఆడ) లకు జన్మనిచ్చింది. జన్మించిన ఆ దూడల్లో ఒక గిత్త దూడ బ్రతికి ఉండగా మిగిలిన మూడు దూడలు చనిపోయాయి. ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంటుందని వైద్యుడు వెల్లడించారు. కాగా బ్రతికి ఉన్న గిత్త దూడ ఆరోగ్యకరంగా ఉందని పశువైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..