Jawad Cyclone Update: ఏపీలోని ఆ ప్రాంతాల్లో మరో మూడురోజులు వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్..

|

Dec 05, 2021 | 2:59 PM

Rain alert for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను గత కొన్ని రోజుల నుంచి వర్షాలు, వరదలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో జొవాద్ తుఫాన్ మరింత కలవరపెట్టింది. అయితే..

Jawad Cyclone Update: ఏపీలోని ఆ ప్రాంతాల్లో మరో మూడురోజులు వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్..
Rain Alert
Follow us on

Rain alert for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను గత కొన్ని రోజుల నుంచి వర్షాలు, వరదలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో జొవాద్ తుఫాన్ మరింత కలవరపెట్టింది. అయితే.. ఆంధ్రప్రదేశ్ కు జొవాద్ తుఫాన్ ముప్పు తప్పింది. జొవాద్ తుఫాన్ వాయుగుండంగా మారి దిశ మార్చుకొని ప్రయాణిస్తుండంటంతో ముప్పు తప్పినట్లయింది. ప్రస్తుతం తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడి వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ ప్రాంతంపై గత 6గంటలలో గంటకు 20 కిమీ వేగంతో ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 270 కిలోమీటర్లు దూరంలో గోపాల్‌పూర్ (ఒడిశా)కు దక్షిణ ఆగ్నేయంగా 90 కిలోమీటర్లు దూరంలో పూరికి 120 కిమీ దూరంలో ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలపింది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం కొనసాగించి వాయుగుండంగా బలహీన పడి, తదుపరి 6 గంటలలో ఒడిశా తీరం పూరి దగ్గరకు చేరుతుందని తెలిపింది. ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా ఒడిస్సా తీరం వెంబడి ప్రయాణం కొనసాగించి పశ్చిమ బెంగాల్ తీరం వైపునకు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఆ తరువాత ఈ రోజు అర్థరాత్రికి తీవ్ర అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో అంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటినుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తాఆంధ్రా, యానాం: ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు, రేపు పొడి వాతావరణం ఉంటుంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ: ఈ రోజు రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read:

King Cobra: ఓ ఇంటి బయట కింగ్ కోబ్రా కలకలం.. ప్రపంచంలో సిగ్గరి ఈ పాము.. హానిచేయవద్దంటున్న స్నేక్ క్యాచర్స్ ..

JNU Delhi: ఆ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను వెంటనే ఆపేయండి.. విద్యార్థులకు సర్క్యూలర్‌ జారీ చేసిన జేఎన్‌యూ అధికారులు..